AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొడుకు కోడలిపై మోహ‌న్ బాబు దాడి.. దెబ్బ‌ల‌తో పీఎస్‌కు మంచు మ‌నోజ్

మంచు ఫ్యామిలీలో గొడవలెందుకు?
అసలేం జరుగుతోంది?

‘మంచు’ ఫ్యామిలీలో అగ్గి రాజుకుంది. తండ్రీకొడుకులైన మంచు మోహన్‌ బాబు, మంచు మనోజ్‌ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కారు. నగరంలోని పహాడి షరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో వీరిద్దరూ ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేశారు.

ఆస్తుల వ్యవహారంలో..
మోహన్‌ బాబు, మంచు మనోజ్‌ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఆస్తుల, స్కూలు వ్యవహారంలో వీరిద్దరి మధ్య దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. తనపై తండ్రి మోహన్‌ బాబు దాడి చేశారని మనోజ్‌ ఫిర్యాదు చేస్తే.. తనపై కొడుకు మనోజ్‌ దాడి చేశాడని మోహన్‌ బాబు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. పహాడి షరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌లో వీరిరువురు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. గాయాలతో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి మరీ మంచు మనోజ్‌ ఫిర్యాదు చేశారని.. తనతో పాటు తన భార్యపై కూడా తండ్రి మోహన్‌ బాబు దాడి చేశారని మంచు మనోజ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫిర్యాదులతో మరోసారి మంచు ఫ్యామిలీ వార్తలలో హైలెట్‌ అవుతోంది.

వినిపిస్తున్న మరో కథనం ఏమిటంటే..
మంచు మనోజ్‌ పైన మంచు మోహన్‌ బాబు అనుచరుడు వినయ్‌ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. మోహన్‌ బాబు అనుచరుడు వినయ్‌పై మంచు మనోజ్‌ ఫిర్యాదు చేశారు. స్కూల్, ఆస్తుల విషయంపైనే దాడులు జరిగాయని, విద్యానికేతన్‌ సంస్థలో మోహన్‌ బాబు అనుచరుడు వినయ్‌ కీలక పదవిలో ఉన్నారని తెలుస్తోంది. వినయ్‌ కొంతమందితో కలిసి మనోజ్‌పై దాడి చేశాడని మరోవైపు టాక్‌ వినబడుతోంది.

అవన్నీ అసత్య ప్రచారాలే.. మంచు ఫ్యామిలీ ప్రకటన
అయితే ఈ దాడి, ఫిర్యాదులలో నిజం లేదని, అవన్నీ అసత్య ప్రచారాలే అంటూ మరో వార్త వైరల్‌ అవుతోంది. ‘‘మోహన్‌ బాబు, మంచు మనోజ్‌ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో నిజం లేదు. మంచు మనోజ్‌ దెబ్బలతో వచ్చి మరీ పొలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కథనాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కథనాలన్నీ అసత్య ప్రచారాలే. వాటిలో నిజం లేదు. ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలను చేయకండి’’ అంటూ మంచు మోహన్‌ బాబు ఫ్యామిలీ ఒక ప్రకటనను విడుదల చేసింది.

మంచు ఫ్యామిలీలో అసలేం జరుగుతుంది?
ఇండస్ట్రీలో మంచి పేరున్న కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ ఒకటి. అసలు.. టాలీవుడ్‌ సినిమా ఒక పుస్తకం అయితే.. అందులో మోహన్‌ బాబుకు ఒక ప్లేస్‌ ఖచ్చితంగా ఉంటుంది. సినిమాల్లో ఒక ప్రస్తానం క్రియేట్‌ చేసుకున్న నటుడు ఆయన. సినిమాల్లో చెదిరిపోని ముద్ర వేసుకున్న మోహన్‌ బాబు.. పర్సనల్‌ లైఫ్‌ మాత్రం ఎప్పుడూ వివాదాలతో చుట్టు ముడుతున్నాయి. నిజానికి.. తెరపై ఎంతో హూందాగా, గంభీరంగా కనిపించే మోహన్‌ బాబు.. తెరవెనుక మాత్రం పలు విషయాల్లో ట్రోల్‌ అవుతూ ఉన్నారు. తాజాగా జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తండ్రీకొడుకులకు ఎందుకు పడటంలేదు? ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? ఆస్తుల గొడవలేనా? మరేదైనా అన్న చర్చ తెలుగు రాష్ట్రాలో జోరుగా సాగుతోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10