(అమ్మన్యూస్, హైదరాబాద్):
రాజస్థాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై ఎన్నికల కమిషన్ ఆయనకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ డమ్మీగా మారిందన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ చేస్తోన్న ప్రసంగాలు చూసి బీజేపీలో వణుకు ప్రారంభమైందన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకం కాదని మోహన్ భగవత్ ప్రకటన చేశారని, ఇందుకు రాహుల్ గాంధీ ప్రసంగమే కారణమన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు ఢల్లీి పోలీసులు నోటీసులు తీసుకురావటం కూడా ఇందులో భాగమే అన్నారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు దీనిని గమనించాలన్నారు.
మోదీ పదేళ్లు ప్రధానిగా ఉండి ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. ప్రజలు దృష్టిని ఆకర్షించడంలో భాగంగా అమిత్ షా గీసిన స్కెచ్ లో భాగంగా ఢల్లీి పోలీసులు గాంధీ భవన్‌కు వచ్చారని విమర్శించారు. ప్రధానమంత్రి హోదాలో పుస్తేల మీద దిగజారుడు రాజకీయాలు చేసినందుకు బీజేపీ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు.