లోక్‌సభ ఎన్నికలకు సమయం మరింత దగ్గర పడుతుండడంతో బీజేపీ హైకమాండ్ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో మెజార్టీ సీట్లను గెలువాలని భావిస్తోంది. దీంతో బీజేపీ అగ్ర నేతలు రాష్ట్రంలో జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల (మే) 8, 10 తేదీల్లో రెండు రోజులు పర్యటించనున్నారు. మే 8న ప్రధాని మోడీ వేములవాడ, వరంగల్ జిల్లాలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలకు హాజరుకానున్నారు. అలాగే 10న మహబూబ్ నగర్, హైదరాబాద్‌లో జరిగే సభలకు హాజరుకానున్నారు. మే 10న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో విజయ సంకల్ప సభకు హాజరుకావడంతో పాటు రోడ్ షో లో పాల్గొనే అవకాశం ఉంది.