AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘మోడీ గ్యారంటీ అంటే.. అభివృద్ధికి గ్యారంటీ’

మోడీ గ్యారంటీ అంటే.. అభివృద్ధికి గ్యారంటీ అని.. దేశ రక్షణకు గ్యారంటీ అని ప్రధాని మోడీ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దుతుగా నారాయణ పేటలో బీజేపీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో మోడీ ప్రసంగిస్తూ.. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్థారించే ఎన్నికలని చెప్పారు. కాంగ్రెస్ దశాబ్దాలుగా ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చిందని విమర్శించారు. దేశం ఇప్పుడు మోడీ గ్యారంటీ వైపు చూస్తోందన్నారు. పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాయని అన్నారు. ఆ డబ్బుతో బీఆర్‌ఎస్ సొంత జేబులు నింపుకుందని, ఇప్పుడు అదే పని కాంగ్రెస్ చేస్తుందని దుయ్యబట్టారు. అప్పుడు తెలంగాణ బీఆర్‌ఎస్ లూటీ చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ అదే పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆర్‌ఆర్ ట్యాక్స్ మొదలైందని వ్యాఖ్యానించారు. ఆర్‌ఆర్ ట్యాక్స్ ఎవరి జేబులోకి వెళ్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఆర్‌ఆర్ ట్యాక్స్ విషయంలో తాను ఎవరి పేరు చెప్పలేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి భుజాలు తడుముకుంటున్నారని కామెంట్స్ చేశారు. ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ ప్రయోజనం పొందాలని చూస్తుందన్నారు. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల కోసం కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రయోజనం లేదని, ఏ పనిని కాంగ్రెస్ ముందుకు వెళ్లనివ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ ఏమైనా చేస్తోంది అంటే.. అది నమ్మక ద్రోహమే అంటూ వ్యాఖ్యలు చేశారు.

దేశాన్ని విడగొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది..

దేశాన్ని ముక్కలు చేసేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో ఒక రాజకుమారుడు ఉన్నాడని, ఎన్నికల సమయంలోనే ప్రేమ చూపిస్తాడని, ఎన్నికల తర్వాత విషయం చిమ్ముతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ యువ రాజుకు అమెరికాలో ఒక రాజగురువు ఉన్నారన్నాని, దేశాన్ని ఒక్కో విధంగా విభజించు పాలించేలా మాట్లాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన జాతి వివక్ష చూపిస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ వాళ్లను ఆఫ్రికన్లతో పోల్చి ఆ రాజగురువు మాట్లాతున్నాడని దుయ్యబట్టారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎజెండానే అని ఆరోపించారు. హిందూ దేవుళ్లను పూజించడం, అయోధ్యకు వెళ్లడం కాంగ్రెస్ నచ్చడం లేదన్నారు. కాంగ్రెస్ స్వభావం హిందూ వ్యతిరేకమన్నారు. దేశాన్ని విడగొట్టాలని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. ముస్లింల కాంగ్రెస్ శక్తివంచన లేకుండా పనిచేస్తుందని, కానీ అదే మాదిగల రిజర్వేషన్లు పట్టించుకోరని దుయ్యబట్టారు. మాదిగ సామాజిక వర్గం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కాదని, కాకూడదన్నారు. కాంగ్రెస్ బీఆర్‌ఎస్ జిరాక్స్ కాపిగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10