AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రద్దు చేయడానికి రాజ్యాంగాన్ని మోడీ రాయలే: ప్రియాంక గాంధీ

ఇందిరా గాంధీని ఆదరించిన నేల ఇది అంటూ ప్రియాంక గాంధీ ప్రసంగాన్ని ప్రారంభించారు. శనివారం చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన జన జాతర సభకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షీతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. సోనియా గాంధీని, సోనియమ్మ అని పిలిచి తల్లిపాత్రను ఇచ్చారని చెప్పారు. గత ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ. 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. రాజ్యాంగాన్ని మార్చలనుకున్న ప్రయత్నాలకు ఇక్కడి నుంచే గండి కొట్టాలన్నారు. పదేళ్లు మోడీ సర్కార్ బడా వ్యాపారుల కోసమే పని చేసిందన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం బీజేపీ ఏమీ చేయలేదని విమర్శించారు. ప్రధాని మోడీ మిత్రుల కోసం రూ. 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ అయ్యాయని అన్నారు. పేద రైతులు రూ. 50 వేల కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజల మధ్య చిచ్చులు పెట్టి.. లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. వాస్తవాలు తెలియకుండా మీడియాను మేనేజ్ చూస్తున్నారని దుయ్యబట్టారు. ధర్మం పేరిట ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. రద్దు చేయడానికి రాజ్యాంగాన్ని మోడీ రాయలేదన్నారు. మన పూర్వీకులు ఎంతో కృషి చేసి బావితరాల కోసం రాశారన్నారు. 140 కోట్ల ప్రజలు ఆకాంక్షలు నెలవేర్చేది రాజ్యాంగం మాత్రమేనన్నారు. కాంగ్రెస్‌పై బీజేపీ ఎన్నో అబద్ధాలు చెప్తుతున్నారని ప్రియాంక గాంధీ మండిపడ్డారు.

బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి

ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు ఆలోచన చేసి తీర్పు ఇవ్వాలని కోరారు. వికారాబాద్‌కు కాంగ్రెస్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. మనకు నీళ్లించేందుకు ప్రాణహిత చేవెళ్లను ఆనాడు మనమే చెప్పట్టామని.. పాలమూరు- రంగారెడ్డిని చేపట్టిందే కాంగ్రెస్ అని గుర్తు చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. కేంద్రం నిర్లక్ష్యంతోనే మన జిల్లా వెనుకబడిందన్నారు. ఈ దుస్థితికి కారణం బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు అంటూ మండిపడ్డారు. మన జిల్లా అభివృద్ధి కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ గెలువాలని కోరారు. రైతు భరోసా కింద రూ. 750 కోట్లు రైతుల ఖాతాలో వేశామన్నారు. సవాల్‌పైయ నిలబడే వ్యక్తి కేసీఆర్ అయితే ముక్కు నేలకు రాయాలన్నారు. రైతులకు రుణమాఫీ చేయకుంటే తనకు ఈ ముఖ్యమంత్రి పదవి దండగన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిందేనని రేవంత్ రెడ్డి అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10