AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ .. తిహార్ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశం

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ షాక్ తగిలింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఈ నాటి విచారణ సందర్భంగా ఆమె పిటిషన్ పై తీర్పును కాసేపు రిజర్వ్ లో ఉంచిన కోర్టు… కాసేపటి క్రితం తీర్పును వెలువరించింది. ఆమెకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించింది. ఆమెను తీహార్ జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించింది. కాసేపట్లో కవితను తీహార్ జైలుకు పోలీసులు తరలించనున్నారు. కోర్టు తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులు షాక్ కు గురయ్యారు.

వచ్చే నెల 16 వరకు కవిత చిన్న కొడుకుకు పరీక్షలు ఉన్నాయని, అప్పటివరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయవాది విక్రమ్ చౌదరి కోరారు. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. కవిత బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1 విచారణ జరపనుంది. కవిత కేసు దర్యాప్తుకు సహకరించడం లేదని.. లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని.. మరికొందరు నిందితులను ప్రశ్నించాల్సి ఉందని కోర్టుకు ఈడీ తెలిపింది. కాగా, లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న అరెస్ట్ అయ్యారు కవిత.

ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు వద్దే కవిత భర్త అనిల్, బంధువులు ఉన్నారు. పీఎంఎల్ఏ సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్ ని తమకు కూడా ఇవ్వాలని కోరారు కవిత తరఫు న్యాయవాది. ఒక అప్లికేషన్ దాఖలు చేయాలని సూచించారు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి. కవిత దాఖలు చేసిన బెయిల్ అప్లికేషన్ పై రిప్లై దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని ఈడీ న్యాయవాది కోరారు.

కేసు దర్యాప్తు పురోగతి లో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొంది ఈడీ. వర్చువల్ మోడ్ లో ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హోస్సేన్ వాదనలు వినిపించారు. లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ తెలిపింది.

తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు.. కానీ..
కడిగిన ముత్యంలా బయటకు వస్తానని మీడియాతో కవిత అన్నారు. ఇది మనీ లాండరింగ్ కాదని పొలిటికల్ లాండరింగ్ కేసని వ్యాఖ్యానించారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చని, కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. మొదటి నిందితుడు బీజేపీలో చేరారని అన్నారు. రెండో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. మూడో నిందితుడు బీజేపీకి ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చారని చెప్పారు. తాను అప్రూవర్ గా మారడం లేదని అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10