వినీలాకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నది. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం బుధవారం ఏర్పడనున్నది. అయితే, ఈ చంద్రగ్రహణం చాలా ప్రత్యేకం. ఇది పాక్షిక గ్రహణం కాగా.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కనిపించనున్నది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో వచ్చిన సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
ఎందుకంటే భూమి కారణంగా సూర్యకాంతి చంద్రుడిపై పడదు. ఈ దృగ్విషయాన్ని చంద్రగ్రహణంగా పిలుస్తారు. వాస్తవానికి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఉపగ్రమైన చంద్రుడు చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తుంటాడు. సూర్యుడి, చంద్రుడి మధ్య భూమి వచ్చిన సమయంలో సూర్యకాంతి చంద్రుడిని చేరుకోలేకపోతుంది.
భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దీన్ని చంద్రగ్రహణంగా పిలుస్తుంటారు. అయితే, ఈ గ్రహణం భారత్‌లో కనిపించే అవకాశం లేదు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6.11 గంటల సమయం ఏర్పడి.. 10.17 గంటలకు ముగుస్తుంది. మొత్తం గ్రహణం 4 గంటల 6 నిమిషాల పాటు కొనసాగుతుంది.
ఈ గ్రహణాన్ని నాసా పత్యక్ష ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. ఈ సారి పాక్షిక చంద్రగ్రహణం దర్శనమివ్వనున్నది. మరో వైపు రేపు చంద్రుడు సాధారణ పౌర్ణమి రోజుల్లో కంటే కాస్త పెద్దగా కనిపించనున్నాడు. దీన్నే సూపర్‌మూన్‌గా పిలుస్తుంటారు. ఈ సూపర్‌మూన్‌ని హార్వెస్ట్ మూన్‌గా పిలుస్తారు. ఈ చంద్రగ్రహణం యూరప్, ఆఫ్రికా, నార్త్, సౌత్ అమెరికాతో పాటు ఆసియాలోని కొన్ని దేశాల్లో కనిపించనున్నది.