AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేను ఓడితే రాజకీయ సన్యాసం.. నువ్వు ఓడితే పార్టీ క్లోజ్ చేస్తావా?

మాజీ మంత్రి కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్. నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. ఇద్దరం మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి పోటీ చేద్దాం అంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ.. నల్గొండలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, కేటీఆర్ కూడా సిరిసిల్లలో రిజైన్ చేసి మళ్లీ అక్కడి నుంచే పోటీ చేద్దామని సవాల్ విసిరారు.

తాను సిరిసిల్లలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యానించారు. ఇక కారు షెడ్ మూసుకోవాలని, కేటీఆర్ ఓడిపోతే పార్టీ క్లోజ్ చేస్తా అని కేసీఆర్ ప్రకటన చేస్తారా? అని ప్రశ్నించారు. కేటీఆర్‌కు టెక్నీకల్ నాలెర్జి లేదని, కేటీఆర్ ఒక చిన్న పిల్లవాడు అంటూ ఎద్దేవా చేశారు. తన స్థాయి కేటీఆర్‌ది కాదన్నారు. కేటీఆర్‌కు క్యారెక్టర్ లేదని, రూ. లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయని మండిపడ్డారు. తనకు క్యారెక్టర్ ఉంది.. డబ్బులు లేవని చెప్పారు. కేటీఆర్ సిరిసిల్లలో రూ. 200 కోట్లు ఖర్చు చేసి 30 వేల ఓట్ల మెజార్టీతో గెలుసాడా? అని నిలదీశారు. ఆయన కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తాని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10