మెదక్ చర్చి అద్భుతంగా ఉందని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వర్ణించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వందేళ్ల ఘన చరిత్ర కలిగిన మెదక్ చర్చిని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆదివారం సందర్శించారు. మెదక్ పర్యటనలో భాగంగా కలెక్టరేట్ కు వచ్చిన గవర్నర్ కు కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.
చర్చి సందర్శన..
అక్కడి నుంచి మెదక్ చర్చిని సందర్శించిన గవర్నర్ ను ప్రెస్ బ్రీటరీ ఇన్చార్జి్జ శాంతయ్య, చర్చి కమిటీ సభ్యులు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. చర్చి వీఐపీ రిజిష్టర్ లో సంతకం పెట్టిన గవర్నర్, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చర్చి గురువులు గవర్నర్ ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, ఆర్డీఓ రమాదేవి, ఎమ్మార్వో లక్ష్మణ్ బాబు, చర్చి సభ్యులు గంట సంపత్, శాంసన్ సందీప్, జాయ్ ముర్రే తదితరులు ఉన్నారు.