మరోసారి పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఎస్పీగా ఉన్న ఎస్‌వీ నాగలక్ష్మిని రాచకొండ సైబర్ క్రైమ్స్ డీసీపీగా, కమాండ్ కంట్రోల్ తెక్నికల్ వింగ్ ఎస్పీగా ఉన్న కె.పుష్పను నార్కోటిక్ కంట్రోల్ సెల్ సూపరింటెండెంట్‌గా, సీఐడీ ఎస్పీగా ఉన్న డాక్టర్ పి లావణ్య నాయక్ జాదవ్‌ను హైదరాబాద్ విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీగా బదలీ చేశారు.
అదేవిధంగా అదనపు ఎస్పీ ర్యాంక్‌లో వెయిటింగ్‌లో ఉన్న కె.శంకర్‌ను సీఐడీ అదనపు ఎస్పీగా, ఉపేందర్‌రెడ్డిని అడ్మిన్ ఏఎస్సీగా నిర్మల్‌కు, నిర్మల్ అదనపు ఎస్పీ అడ్మిన్‌గా ఉన్న సూర్యనారాయణను సివిల్‌సప్లై శాఖలో అడిషనల్ ఎస్పీగా, ప్రతాప్‌కుమార్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు, శ్రీకృష్ణ గౌడ్‌ను అడిషనల్ డీసీపీ సెట్రల్ జోన్‌కు, వెంకటేశ్వరబాబును ఇంటలిజెన్స్ అదనపు డీసీపీగా, నర్సయ్యను ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీగా, పిచ్చయ్యను సీఐడీ అదనపు సూపరింటెండెంట్‌గా, కమలాకర్‌రెడ్డిని ఏసీబీకి, మహ్మద్ ఇక్బాల్ సిద్దిఖీని సైబరాబాద్ అడిషనల్ డీసీపీగా క్రైమ్ విభాగానికి, కిషన్‌ను భూపాలపల్లి అదనపు ఎస్పీగా, మజీద్‌ను సౌత్ జోన్ అడిషనల్ డీసీపీగా బదలీలు చేసింది. మొత్తంగా ముగ్గరు నాన్ క్యాడర్ సూపరింటెండ్లను, 30మంది అదిషనల్ సూపరింటెండెట్లకు ప్రభుత్వం స్థానచలనం కల్పిస్తూ, పలువురికి పోస్టింగ్‌లనిస్తూ నిర్ణయం తీసుకుంది.