మేడ్చల్ జిల్లా పోచారం ఐటీకారిడార్ ఠానా పరిధిలో భారీ చోరీ జరిగింది. చౌదరిగూడలోని మక్త గ్రామంలో నాగభూషణం అనే వ్యక్తికి చెందిన ఇంటి తాళం పగులగొట్టిన దుండగులు బీరువాలో దాచిన రూ.2.2 కోట్లతో పాటు 28 తులాలు బంగారు నగలు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగతనం గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
కాగా, శంకర్‌పల్లిలో తన 10 ఎకరాల భూమి అమ్మడానికి నాగభూషణం ఒప్పందం చేసుకున్నాడని, అడ్వాన్స్‌గా ఇచ్చిన నగదును దొంగలు ఎత్తుకెళ్లారని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఇది తెలిసినవారు చేసిన పనేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యం నాగభూషణం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.