AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మౌనికతో మనోజ్ పెళ్లి అంటే పెద్దయ్యకు ఇష్టం లేదు: పని మనిషి

మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం తెలుగు రాష్ట్రాల్లో కాకరేపుతోంది. పూటకో అప్ డేట్ వస్తోంది. తనపై దాడి జరిగిందంటే.. నాపై జరిగిందని మోహన్ బాబు- మనోజ్ అంటున్నారు. ఇంతలో మోహన్ బాబు ఇంటి పని మనిషి లైన్ లోకి వచ్చారు. వివాదానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. గొడవకుఆస్తి కారణం కాదని తేల్చి చెప్పారు. స్టాఫ్ విషయంలో తండ్రీకొడుకుల మధ్య వివాదం చెలరేగిందని, అది కాస్త చిలికి చిలికి గాలి వానలా మారిందని చెప్పుకొచ్చారు.

మోహన్ బాబు సిబ్బంది ప్రసాద్ అనే వ్యక్తి తప్పు చేశాడు. శనివారం రాత్రి అతనిపై మోహన్ బాబు దాడి చేశాడు. విషయం తెలిసిన మనోజ్ ఆదివారం ఉదయం ప్రసాద్‌పై దాడి చేయబోయారు. తన సిబ్బందిపై చేయి వేయొద్దని మనోజ్‌కి మోహన్ బాబు సూచించారు. తన సిబ్బందికి తానే భయంలో పెట్టుకుంటానని మనోజ్‌ను తోసేశారు. తర్వాత ఒకరినొకరు తోసుకున్నారు. స్టాఫ్ గురించే ఈ మొత్తం గొడవ జరిగింది. ఈ విషయంతోపాటు పాత విషయాలూ మనసులో పెట్టుకుని ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు, విష్ణుకి ఏ మాత్రం ఇష్టం లేదు. గొడవలో మనోజ్‌కి ఎలాంటి గాయాలూ కాలేదు” అని పనిమనిషి స్పష్టం చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10