మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్.. ఆందోళనలో కుటుంబసభ్యులు Hyderabad | హైదరాబాద్‌లో మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. గురువారం సాయంత్రం ఆనంద్‌బాగ్‌లోని తన కార్యాలయం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను ఎత్తుకెళ్లారు. దుండగులు ఇన్నోవా, బొలెరో వాహనాల్లో వచ్చి కార్పొరేటర్ శ్రవణ్‌ను తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా తెలుస్తోంది.
హైదరాబాద్‌లో మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్ కలకలం సృష్టించింది.
సాయంత్రం ఆనంద్‌బాగ్‌లోని తన కార్యాలయం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను ఎత్తుకెళ్లారు. దుండగులు ఇన్నోవా, బొలెరో వాహనాల్లో వచ్చి కార్పొరేటర్ శ్రవణ్‌ను తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా తెలుస్తోంది. కార్పొరేటర్ కిడ్నాప్‌పై ఆయన కుటుంబసభ్యులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులే కార్పొరేటర్ శ్రవణ్‌ను అదుపులోకి తీసుకుని ఉంటారని తెలుస్తోంది. అయితే దీనిపై మాత్రం పోలీసు శాఖ స్పందించలేదు. కాగా, ఒకవేళ పోలీసులే అదుపులోకి తీసుకుంటే దీనిపై ముందస్తుగా సమాచారం అందించాల్సిన అవసరం లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్‌పై ఆయన తండ్రి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.