AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరికాసేపట్లో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్.. మహా రిజల్ట్‌పై ఉత్కంఠ

మరి మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే మహారాష్ట్ర, జార్ఖండ్‌లో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేసేశారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఉదయం 8.30 నుంచి ఈవీఎంల ఓట్లను అధికారులు లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలు, జార్ఖండ్‎లోని 81 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించింది ఈసీ. ఇదే రోజు వాయనాడ్‌లో కూడా ఉప ఎన్నిక ఫలితాలు విడుదల అవనున్నాయి. ఇక్కడ కూడా ఎవరు గెలుస్తారనే దానిపై అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

ఇండియాలో ఉత్తరప్రదేశ్ తర్వాత పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. రాజకీయాల పరంగా కూడా ఇది ముఖ్యమైన రాష్ట్రం. ఇక్కడ గెలుపోటములు ప్రముఖ పార్టీలన్నింటికీ చాలా అవసరం. ఈసారి ఎన్నికల్లో మహాయుతిని గెలిపించి మళ్ళీ అధికారంలోకి రావాలని బీజేపీ, రెండవ పెద్ద రాష్ట్రంలో పట్టు సాధించాలని ఇండియా కూటమి చాలా గట్టిగా ప్రయత్నించాయి.  ఇక మహారాష్ట్ర‎‎లో గెలుపుపై ఎన్డీఏ, ఇండియా కూటములు రెండూ ధీమాతో ఉన్నాయి. ఇక్కడ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా కుల గణన, రిజర్వేషన్లు, రైతుల పంటలకు మద్దతు ధర, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు నిలువగా.. జార్ఖండ్ ఎన్నికల్లో అక్రమ చొరబాట్లు, రిజర్వేషన్లు, జేఎంఎం అవినీతి, రైతుల పంటలకు మద్దతు ధరలు, ఉద్యోగాలు, సంక్షేమ పథకాల వంటివి  ప్రధాన అంశాలుగా నిలిచాయి. మహారాష్ట్రలో 145 మేజిక్ ఫిగ్‌ను సాధించి మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని మహాయుతి, బీజేపీ నమ్మకంగా చెబుతున్నాయి.

అయితే మహారాష్ట్రలో దాదాపు పెద్ద సర్వే సంసంథలు అన్నీ ఎగ్జిట్ పోల్స్ను ఇవ్వలేదు. ముఖ్యంగా మై యాక్సిస్ ఇండియా సర్వే అస్సలు దాని ఊసే ఎత్తలేదు. జార్ఖండ్‌లో రిలీజ్ చేసినా ఏదో తమ ట్విట్టర్, వెబ్ సైట్లలలో నిలీజ్ చేసుకుందే తప్ప. ఎక్కడా, ఏ టీవీ ఛానెల్ లేదా వార్తా సంస్థలకు తమ ఎన్నికల ఫలితాల అంచనాలను ఇవ్వలేదు. లోక్ శాహీ మరాఠీ, చాణక్య, సీఎన్ఎన్ న్యూస్ –18 లాంటివి మాత్రమే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్‌ను రిలీజ్ చేశాయి. మహారాష్ట్రాలో కొద్దో గొప్పో చెప్పుకోవాల్సి వస్తే పీపుల్ పల్స్ ఒకటే పెద్దదిగా చెప్పుకోవాలి. అవతల జార్ఖండ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో ఇప్పుడు ఫైనల్ ఫలితాల మీద అభ్యర్థులతో పాటూ ఓటర్లు కూడా చాలా ఉత్కంఠగా ఉన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10