లోక్‌సభ ఎన్నికల కోసం ఏఐసీసీ అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పెద్దపల్లి (ఎస్సీ) గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్‌గిరి స్థానానికి సునీత మహేందర్‌రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవేళ్ల నుంచి రంజిత్‌రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. తొలి జాబితాలో నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.
జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, నల్గొండ నుంచి కుందూర్ రఘువీర్, మహబూబ్‌నగర్ చల్లా వంశీచందర్, మహబూబాబాద్ (ఎస్టీ) బలరాం నాయక్‌ను అభ్యర్థులుగా ప్రకటించింది. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఇప్పటి వరకు కాంగ్రెస్ 8 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కరీంనగర్, ఖమ్మం, మెదక్, వరంగల్, భువనగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.