వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో స్వల్పంగా బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. జేసీబిల ద్వారా సిబ్బంది రోడ్డుపై పడిన బండ రాళ్లను తొలగిస్తున్నారు.
వర్షాల నేపథ్యంలో శ్రీవారి పాదాలు, ఆకాశ గంగ, జాపాలి, పాపవినాశనానికి భక్తులను టీటీడీ అనుమతించడం లేదు. మరో పక్క వర్షాల కారణంగా భక్తుల భద్రత దృష్ట్యా ఇప్పటికే తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. తిరుమల గిరుల్లో వర్షాలతో మాల్వాడిగుండం భారీగా ప్రవహిస్తోంది.