AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జూబ్లీహిల్స్‌లో స్థల వివాదం.. హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 75లో ఉన్న ఓ స్థలానికి సంబంధించిన వివాదంలో పిటిషన్ దాఖలు చేశారు. తారక్ 2003లో గీతాలక్ష్మి మహిళ అనే మహిళ నుంచి ప్లాట్ కొనుగోలు చేశారు. అప్పటికే 1996 నుంచి పలు బ్యాంకుల దగ్గర ఇదే స్థలంపై గీతాలక్ష్మి ప్రాపర్టీ మార్టిగేజ్ ద్వారా రుణాలు పొందారు. మూడు, నాలుగు బ్యాంకుల నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్లు తీసుకున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌కు స్థలం అమ్మే సమయంలో ఈ విషయాన్ని గీతాలక్ష్మి దాచిపెట్టారు.

ఐదు బ్యాంకుల నుంచి ఇదే డాక్యుమెంట్ మీద గీతాలక్ష్మి రుణాలు తీసుకున్నారు. కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్టిగేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్‌కు గీతాలక్ష్మి చెప్పారు. తారక్ చెన్నైలో ఒక బ్యాంక్‌లో లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నారు.. 2003 నుంచి ఎన్టీఆర్ ఆ స్థలానికి యజమానిగా ఉన్నారు. అప్పటి నుంచి మిగిలిన బ్యాంక్ మేనేజర్లతో వివాదం కొనసాగుతోంది.. ఆ ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు ప్రయత్నించారు. ఈ క్రమంలో బ్యాంకు మేనేజర్లపై జూనియర్ ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019లో ఈ వ్యవహారంపై పోలీసులు ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారు. తాజాగా DRTలో జూనియర్ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దీంతో తారక్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. జూన్ 3లోపు DRT డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయాలని కోర్టు కోరింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు జూన్ 6న విచారణ చేపడతామన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10