AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్ కబుర్లొద్దు.. తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకోవడం హాస్యాస్పదం.. టీపీసీసీ చీఫ్

ఫార్ములా ఈ-రేస్ కేసులో తాను కడిగిన ముత్యమంటూ కేటీఆర్ తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకోవడంపై రియాక్ట్ అయ్యారు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్. ఫార్ములా ఈ- రేసులో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనన్నారు. అక్రమాలు జరిగినట్టు పలు ఆధారాలున్నాయన్నారు. తనకు తానే కేటీఆర్‌ సర్టిఫికెట్ ఇచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ప్రభుత్వం పంపిన ఆధారాలపై గవర్నర్‌ న్యాయసలహా తీసుకొని కేసుకు అనుమతించాక అక్రమ కేసు ఎలా అవుతుందని సూటిగా ప్రశ్నించారు. చట్టపరంగా కేసు నమోదు అయినందున కోర్టులో తేల్చుకోవాలని సూచన చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.

ఈ-రేస్‌లో HMDA భాగస్వామ్యం కాకపోయినా విదేశీ సంస్థకు ఆనాడు 55 కోట్ల నిధులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అంతేకాదు మూడేళ్ల పాటు రేసింగ్ జరిగేలా 600 కోట్లతో ఒప్పందం జరగలేదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాద్ ప్రతిష్ట ఏ మాత్రం పెరగలేదన్నారు.

ప్రజలను ఇబ్బంది పెట్టి ట్రాఫిక్ జాములు చేసి ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించారని మండిపడ్డారు. ఆధారాలు కనిపిస్తున్నా అక్రమాలకు పాల్పడలేదని కేటీఆర్‌ బుకాయించడాన్ని తప్పుబట్టారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు నిధులు మంజూరు ఎలా చేస్తారని అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10