AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాగచైతన్య, సమంతను విడగొట్టింది కేటీఆరే.. హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటున్న దుర్మార్గుడు

వారికి డ్రగ్స్‌ అలవాటు చేసిందీ ఈ నీచుడే
కేటీఆర్‌ బట్టలు ఊడదీసి బజారులో ఉరికించడం ఖాయం
మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్‌ సమంత విడిపోవడానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆరే కారణమని ఆరోపించారు. కేటీఆర్‌కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటని.. వారికి డ్రగ్స్‌ అలవాటు చేసింది ఈ నీచుడేనని అన్నారు. బాపూఘాట్‌ లో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘కేటీఆర్‌ కు తల్లి అక్క, చెల్లి లేరా? హీరోయిన్ల జీవితాలతో ఈ దుర్మార్గుడు ఆడుకున్నారు. మత్తుపదార్థాలు అలవాటు చేశారు. వాళ్ల ఫోన్లు ట్యాప్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ దొంగ ఏడుపులు మాకవసరం లేదు. నాపై ట్రోలింగ్‌ జరిగినప్పుడు హరీశ్‌రావు ఎందుకు స్పందించలేదు. మంత్రి సీతక్క, మేయర్‌ గద్వాల విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టారు. ఐదేళ్లు బీఆర్‌ఎస్‌లో పనిచేశా.. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు. అసభ్యకరంగా పోస్టులు పెట్టినవారిపై ఫిర్యాదు చేశాం. రాజకీయ విలువలు దిగజారిపోయాయి. ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తిచూపాలి. వ్యక్తిత్వం దెబ్బతీసేలా ప్రవర్తించవద్దు. దుబాయి నుంచి నాలుగు సోషల్‌ మీడియా అకౌంట్లతో నాపై ఫేక్‌ పోస్టులు పెడుతున్నారు‘అని సురేఖ ఘాటుగా వ్యాఖ్యానించారు.

అసలు జరిగింది ఇదీ..
జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా తాను మెదక్‌ వెళ్లినప్పుడు.. చేనేత కార్మికుల సమస్యలను చెబుతూ.. బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు గౌరవ సూచకంగా తనకు ఒక నూలు దండ వేస్తే.. దాన్ని బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా అసభ్యకరంగా ట్రోల్‌ చేసిందంటూ మంత్రి కొండా సురేఖ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ట్రోలింగ్‌ చూసి గడిచిన రెండ్రోజులుగా తనకు అన్నం సహించడం లేదని, నిద్ర పట్టట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గాంధీభవన్‌ లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేటీఆర్, హరీశ్‌రావు ఇంట్లో ఆడవాళ్లపైనా ఇలాంటి ట్రోలింగ్‌ చేస్తే వారికెలా ఉంటుందని ప్రశ్నించారు. రఘునందన్‌రావు తనకు సోదర సమానుడని, ఆయన తనకు ఫోన్‌ చేసి బాధపడ్డారని వెల్లడించారు. తనపై అసభ్యకరంగా పెట్టిన పోస్టులో డీపీ హరీశ్‌రావుది ఉందన్నారు. తనపైన జరిగిన ట్రోలింగ్‌కు హరీశ్, కేటీఆర్‌లు క్షమాపణ చెప్పాలన్నారు.

ఇక క్షమించేది లేదు..
బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ద్వారా ఇకపై ఇలా ట్రోలింగ్‌లు చేస్తే క్షమించేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు.. కేటీఆర్‌ బట్టలు విప్పించి బజారున ఉరికిస్తరని హెచ్చరించారు. తనపై అసభ్యకరంగా పెట్టిన పోస్టుపైన సైబర్‌ క్రై మ్‌లో ఫిర్యాదు చేశామని, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికీ తీసుకెళ్లామని చెప్పారు. కాగా.. మీడియా సమావేశం ముగిసేలోపు సురేఖ పలుమార్లు భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. ఇటు పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ స్పందిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలపైన సోషల్‌ మీడియా ద్వారా బీఆర్‌ఎస్‌ నేతలు దాడులు చేస్తున్నారని, ఈ వర్గాలు కన్నెర్ర చేస్తే వారెక్కడుంటారని ప్రశ్నించారు. సురేఖపై పోస్టులను కేటీఆర్‌ ఎందుకు ఖండించలేదని నిలదీశారు.

తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత..
కాగా, కొండా సురేఖపై ట్రోలింగ్‌లను నిరసిస్తూ తెలంగాణ భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణ భవన్‌ వద్ద కేటీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించిన కాంగ్రెస్‌ కార్యకర్తలను బీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10