AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు హైదరాబాద్‌కు కిషన్ రెడ్డి, బండి సంజయ్.. సెల్యూట్ తెలంగాణ ర్యాలీ

కేంద్ర మంత్రులుగా ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి తెలంగాణ నేతలైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ నేడు హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులకు స్వాగతం పలికేందుకు తెలంగాణ బీజేపీ భారీగా ఏర్పాట్లు చేసింది. ఎనిమిది లోక్‌సభ నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు బీజేపీ తెలంగాణ యూనిట్ బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వరకు ‘సెల్యూట్ తెలంగాణ ర్యాలీ’ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ సహా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొననున్నారు.

ఈ ర్యాలీ సాయంత్రం 4 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బేగంపేట్, ప్యారడైజ్, రాణీ గంజ్, కవాడీగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, వైఎంసీఏ, హిమాయత్ నగర్, బషీర్ బాగ్, నాంపల్లి పార్టీ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. ర్యాలీ అనంతరం కొత్తగా ఎన్నికైన ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్‌, ఎం.రఘునందన్‌రావు, నగేశ్‌, ధర్మపురి అర్వింద్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా సన్మానించనున్నారు.

అనంతరం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత వారు పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10