AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఐదేళ్లుగా అంతర్జాతీయంగా కిడ్నీ దందా.. ప్రధాన సూత్రధారి హైదరాబాద్‌ డాక్టరే..

పట్టుకునేందుకు నగరానికి చేరుకున్న కేరళ సిట్‌ అధికారులు
సబిత్‌ నాసిర్‌ అరెస్టుతో కీలక విషయాలు వెలుగులోకి..
బాధితుల్లో ఎక్కువ మంది హైదరాబాదీలు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
నగరం కేంద్రంగా అంతర్జాతీయ కిడ్నీ దందా నడుస్తోంది. కేరళలో వెలుగుచూసి ఈ దందా దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించినట్టు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు కీలకంగా ఉన్నట్టు పట్టుబడిన నిందితుడు వెల్లడించాడు. అంతేకాదు, వారిలో ఓ డాక్టర్‌ ఉన్నాడని, అతడే ఇదంతా నడిపిస్తున్నాడని చెప్పాడు. దీంతో కేరళ నుంచి పోలీసులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. అతడు ఇచ్చిన వివరాలు ఆధారంగా ఆ డాక్టర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కొచ్చిలో అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ గుట్టురట్టు కాగా.. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఒక డాక్టర్‌ను ప్రధాన సూత్రధారిగా కేరళ పోలీసులు గుర్తించారు. కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్న సబిత్‌ నాసిర్‌ అనే యువకుడు పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపెట్టాడు. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ దందా నడిపిస్తున్నారని, వారిలో ఒక వైద్యుడు ఉన్నాడని అతడు వెల్లడించాడు. దీంతో ఎర్నాకుళం రూరల్‌ ఎస్పీ వైభవ్‌ సక్సేనా నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) హైదరాబాద్‌ చేరుకుంది. మిగతా ఇద్దరు బ్రోకర్లను గుర్తించేందుకు సిట్‌ ప్రయత్నిస్తోంది.

బాధితులను ఇరాన్‌కు తీసుకెళ్లి.. కిడ్నీలు అమ్మించిన ఆ వైద్యుడు ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక, తెలంగాణలకు చెందిన పేద యువకులను ఈ ముఠా ఇరాన్‌ తీసుకెళ్లి.. కిడ్నీలను అమ్ముకుంటోంది. అయితే, బాధితుల్లో ఒకరు వృతి చెందడంతో కిడ్నీ రాకెట్‌ వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రాకెట్‌లో కీలక సభ్యుడు సబిత్‌ నాసిర్‌ను ఇరాన్‌ నుంచి కొచ్చికి వస్తుండగా ఆదివారం అతడ్ని ఎయిర్‌పోర్ట్‌లో కేరళ పోలీసులు అరెస్టు చేశారు.

కోర్టు రిమాండ్‌కు అనుమతించడంతో.. విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. నిందితుడు సబిత్‌ ఈ దందాలో చేరడానికి హైదరాబాద్‌కు చెందిన డాక్టరే ప్రధాన కారణమని తెలిసింది. 2019లో ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తికి కిడ్నీ ఇప్పించిన సమయంలో డాక్టర్,సబిత్‌ల మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి స్నేహితులైన ఈ ఇద్దరూ రాకెట్‌ను నడిపిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్‌లకు చెందిన 40 మంది యువకులను ఇరాన్‌ తీసుకెళ్లి.. వారి కిడ్నీలను విక్రయించినట్లు సబిత్‌ విచారణలో అంగీకరించాడు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10