మంత్రి అతిషి..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారా? లేదా అనే చర్చ తీవ్రంగా సాగుతోంది. ఒకవైపు కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఆప్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
మరోవైపు.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి క్లారిటీ ఇచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయరని స్పష్టం చేశారు. అవసరమైతే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతారని అతిషి ధృవీకరించారు. ‘అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఉన్నారు. ఢిల్లీ సీఎంగానే ఉంటారు. ఆయన సీఎంగానే కొనసాగుతారు. కేజ్రీవాల్ రాజీనామా చేయరు. అవసరమైతే జైలు నుంచి పనిచేస్తారని మొదటి నుంచి మేము చెబుతూనే ఉన్నాం’ అని ఆమె పేర్కొన్నారు.