AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లిక్కర్‌ కేసులో కవిత సంచలన నిర్ణయం.. సీబీఐ కేసులో కీలక పరిణామం

రౌస్‌ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ ఉపసంహరణ
సీబీఐ కేసులో కీలక పరిణామం

(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్‌ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రౌస్‌ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. సోమవారం రౌస్‌ అవెన్యూ కోర్టులో కవిత డిఫాల్ట్‌ బెయిల్‌ కేసు విచారణ వాయిదా పడింది. కవిత తరపు న్యాయవాదులు విచారణకు హాజరుకాకపోవడంతో జడ్జి కావేరి బవేజా అసహనం వ్యక్తం చేశారు. వాదనలకు రాకపోతే పిటిషన్‌ ఉపసంహరించుకోవాలని జడ్జి కావేరి బవేజా పేర్కొన్నారు. రేపటికి కేసును వాయుదా వేస్తూ కోర్టు తుది విచారణ జరుపుతామని తెలిపింది. రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో ఈరోజే కేసును కవిత న్యాయవాదులు ఉపసంహరించుకున్నారు.

చార్జ్‌ షీట్‌లో తప్పులు లేవు..సీబీఐ
సీబీఐ చార్జ్‌ షీట్‌లో తప్పులు ఉన్నాయని కవిత డిఫాల్ట్‌ బెయిల్‌కు అర్హురాలని జూలై 6న కవిత న్యాయవాదులు డిఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ వేశారు. చార్జ్‌ షీట్‌లో తప్పులేవి లేవని సీబీఐ తెలిపింది. ఇప్పటికే సీబీఐ చార్జ్‌ షీట్‌ను జూలై 22న కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆగస్టు 9న చార్జ్‌ షీట్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పట్లో తీహార్‌ జైలు నుంచి బయటికి వచ్చే మార్గాలు ఏ మాత్రం కనిపించట్లేదు. ఇప్పటికే బెయిల్‌ పిటిషన్‌ ను పలుమార్లు పక్కనెట్టిన రౌస్‌ అవెన్యూ కోర్టు.. సోమవారం నాడు డీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణను వాయిదా వేసింది. ఇవాళైనా విచారణకు వస్తుందనుకుంటే.. రౌస్‌ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు.

కాగా.. కవితను మార్చి– 15న తొలుత ఈడీ, ఆ తర్వాత ఏప్రిల్‌– 11న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కూడా కవిత బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఈడీ, సీబీఐ పెట్టిన రెండు కేసుల్లోనూ సాధారణ బెయిల్‌ ఇవ్వాలన్న పిటిషన్‌ను గతంలోనే ట్రయల్‌ కోర్టు కొట్టివేసింది. ఈ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో కవిత సవాల్‌ చేశారు. అయితే ఆమెకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ట్రయల్‌ కోర్టులోనే మళ్లీ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని జూలై– 22న విచారించిన ట్రయల్‌ కోర్టు జడ్జి కావేరి బవేజా కేసును సోమవారానికి(ఆగస్టు–05) వాయిదా వేశారు. నిన్న విచారణకు కవిత తరుఫు న్యాయవాదులు హాజరు కాలేదు. మంగళవారం డీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ను కవిత ఉపసంహరించుకున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10