ప్రారంభోత్సవంలో ఎఎన్ఎన్ మీడియా సిఈవో కంది రామచంద్రారెడ్డి
ఫిల్మ్ నగర్, హైదరాబాద్-
కారుణ్యశ్రీయాన్ష్ ఫిలిమ్స్ పతాకంపై వూర శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవం ఫిల్మ్ ఛాంబర్ లో జరగ్గా, అమ్మన్యూస్ నెట్ వర్క్ మీడియా సిఈవో కంది రామచంద్రారెడ్డి, ప్రముఖ నిర్మాత తుమ్మల పల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పోతురాజు నరసింహారావు, కె.సాయితేజ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, కథను కె.సుష్మ ప్రియదర్శిని , మాటలు దాసరి వెంకట క్రిష్ణ అందిస్తున్నారు. పాటలు కళారత్న డాక్టర్ బిక్కిక్రిష్ణ రాస్తుండగా, సంగీతం శ్రీధర్ ఆత్రేయ అందిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్ ను కంది రామచంద్రారెడ్డి అభినందించారు. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి సత్యనారాయణ చిత్రానికి క్లాప్ కొట్టి ప్రారంభించగా, నటీనటులు తొలి డైలాగ్ చెప్పారు.