AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ పునఃప్రారంభం..

కాళేశ్వరం కమిషన్ విచారణ ఊపందుకుంది. కొన్నిరోజులుగా ఆగిపోయిన విచారణ నేటి నుంచి పునఃప్రారంభం కానుంది. ఇవాళ (సోమవారం) 14మంది ఇంజినీర్లను జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ విచారించనుంది. విచారణలో భాగంగా డీఈ, ఏఈలు కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. మంగళవారం మరో 14మంది ఇంజినీర్లను కమిషన్ విచారించనుంది.

ఈసారి మొత్తం 52మంది ఇంజినీర్లను ఘోష్ కమిషన్ ప్రశ్నించనుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు కమిషన్‌కు చేరాయి. ఇంజినీర్ల తర్వాత ఐఏఎస్ అధికారులను విచారించనున్నారు. వారి తర్వాత కాంట్రాక్టర్ల పిలిచి పలు ప్రశ్నలు సంధించనున్నారు. అకౌంట్స్ డిపార్ట్మెంట్ అధికారులను సైతం కాళేశ్వరం కమిషన్ విచారణ చేయనుంది. ముఖ్యంగా ప్రాజెక్టు నిధుల సేకరణ, బదిలీ అంశంపై కమిషన్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు పలు ప్రశ్నలు సంధించనుంది.

బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలను సైతం బహిరంగ విచారణకు పీసీ ఘోష్ కమిషన్ పిలిచే అవకాశం ఉంది. మాజీ మంత్రులు హరీశ్ రావు, కేసీఆర్‌ను సైతం విచారించే యోచనలో కమిషన్ ఛైర్మన్ ఘోష్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం మూడు బ్యారేజీలకు చెందిన కీలక అంశాలను జస్టిస్ చంద్రఘోష్ సేకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల నిర్మాణంపై విధాన నిర్ణయం తీసుకున్న వారితోపాటు ఆ నిర్ణయాల్లో భాగస్వాములైన మాజీ కీలక ప్రజాప్రతినిధులను విచారణకు పిలిచే అవకాశాలున్నాయి. విచారణ తుది దశకు చేరుకోగా.. అందర్ని విచారించిన అనంతరం ఈ ఏడాది డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ నివేదిక ఇవ్వనున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10