కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా జస్టిస్ పీసీఘోష్ కమిషన్ మేడిగడ్డ ఏఈఈ, డీఈలను విచారించింది. నిర్మాణం, పనుల వివరాలపై ఆరా తీసింది. క్షేత్రస్థాయి పనుల రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్న కమిషన్, పనులపై ప్లేస్‌మెంట్ రికార్డులను అడిగి తెలుసుకుంది. ప్రాజెక్టు DPR, అనుమతులు సహా పలు అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం.