AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్ అసహనం.. బీఆర్ఎస్ కు చిడతలు వాయించేవాళ్ళే జర్నలిస్టులా?

అసలు జర్నలిస్టులు లేకపోతే తెలంగాణ ఉద్యమం ఎక్కడిది?

బుద్వేల్ లో భూములు కేటాయించకుండా అడ్డుపడింది ఎవరు?

విలేకరుల సమావేశాల్లో కేసీఆర్ జర్నలిస్టులను ఎలా హేళనచేశారు?

హైదరాబాద్ సహా జిల్లాల్లో జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఎందుకు ఇవ్వలేదు?

భజన చేసే వారు తప్ప మిగతా జర్నలిస్టులను తొమ్మిదిన్నరేళ్లలో మనుషులుగా చూశారా?

కేటీఆర్ తీరుపై తీవ్రస్ధాయిలో భగ్గుమంటున్న జర్నలిస్టులు

(హైదరాబాద్, అమ్మన్యూస్)

జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ట్వీట్లపై విస్మయం వ్యక్తమవుతోంది. కేటీఆర్ కు ఎందుకింత అసహనం.. ఎందుకింత కసి అంటూ పలువురు జర్నలిస్టులు మండిపడుతున్నారు. శనివారం జర్నలిస్టులపై కేటీఆర్ రెండు ట్వీట్లు చేయగా, పలువురు జర్నలిస్టులు కేటీఆర్ తీరును విమర్శిస్తూ పోస్ట్ లు పెట్టారు. బీఆర్ఎస్ కు చిడతలు వాయిస్తేనే జర్నలిస్టులా అంటూ ప్రముఖ జర్నలిస్ట్ జకీర్ తన వాల్ పై పోస్ట్ చేయగా, పలువురు జర్నలిస్టులు కేటీఆర్ తీరును ఆక్షేపిస్తూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో, వాట్సాప్ లలో స్పందించారు. టూర్లకు వెళ్ళిన జర్నలిస్టులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్న చర్చ జరగ్గా, గత కొద్దిరోజులుగా వివిధ అంశాలపై ఆయన స్పందనలు సొంతపార్టీలోనే చర్చకు దారితీస్తున్నాయి.

ఓ జర్నలిస్టు వాల్ పై ఉన్న పోస్ట్ సారాంశం.

జర్నలిస్టులంటే ఇంత చులకన!

నిలువెల్ల అహంకారం+ నడ మంత్రపు సిరి+ తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని భూముల దోపిడీ+ ఫార్మ్ హౌస్ లలో జల్సాలు+విలాసాలు= ?

తమకు (తనకు) భజన చేసే కొద్ది మంది మినహా,మిగతా జర్నలిస్టులను తొమ్మిదిన్నర సంవత్సరాలలో
కనీసం మనుషులుగా కూడా చూడని వ్యక్తిత్వం!

మొన్నీ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఆమెరికా,కొరియా దేశాలకు అధికార పర్యటన జరిపిన సందర్భంలో ఒకరిద్దరు జర్నలిస్టులు కూడా అదే సమయంలో ఆస్ట్రేలియాకు వెళ్లారు.ఆ జర్నలిస్టులు ఏదో నేరం చేసినట్టు పోస్టులు పెట్టడం ఏమిటి? జర్నలిస్టులు విదేశాలకు వెళ్ళకూడదా? పైగా వాళ్ళ ఖర్చు ఎవరు పెట్టారు? జర్నలిస్టులు తమ యాజమాన్యాలకు తెలిపారా? వారి ఆమోదం ఉందా?

| ఏమిటీ ప్రశ్నలు?

-ఎంత అసహనం? ఎంత కసి?

-జర్నలిస్టులు స్వతంత్రంగా వ్యవహరించాలని నీతి సూత్రాలు!!

-బీఆర్ఎస్ కు చిడతలు వాయించే వాళ్ళే జర్నలిస్టులా?

-బీఆర్ఎస్ పాలనలో జర్నలిస్టులు స్వతంత్రంగా పనిచేసే వాతావరణం ఏ రోజు ఆయినా కనిపించిందా?

-జర్నలిస్టులను,మీడియా సంస్ధలను తండ్రీ, కొడుకు ఎట్లా నియంత్రించారో తెలియదా? ఎట్లా అదుపాజ్ఞల్లో ఉంచుకున్నారో,ఎంతమందిపై తప్పుడు కేసులు పెట్టారో తెలియదా?

-టీవీ నైన్ రవిప్రకాష్ గెంటివేత వెనుక ఉన్నదెవరు? ఆయనను జైలు పాలు చేసిన శక్తులు ఏవి?

-బీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా వార్తలు రాస్తే…. ఎట్లా ట్రీట్ చేశారో చూశాం.

– జర్నలిస్టుల స్వేచ్ఛ,స్వాతంత్య్రం గురించి మాట్లాడే ‘వ్యక్తి’కి అర్హత ఉందా?

-అధికారం కోల్పోయిన తర్వాత కూడా అహంకారం ఒక్క తులం కూడా తగ్గకపోవడం వాళ్ళ ‘భూస్వామ్య’ పోకడను తెలియజేస్తున్నది!

– తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దాన్ని ‘పంటికి అందకుండా ‘ మింగివేయాలని 2001 లోనే పథకాన్ని రచించినట్టు తెలియని సకల జనులు టీఆర్ ఎస్ కు మద్దతు ఇవ్వడం ఈ శతాబ్దపు విషాదం!

– విలేకరుల సమావేశాల్లో కేసీఆర్ ఎట్లా తూలనాడేవారు? ఎట్లా హేళన చేసేవారు? ఎంత నీచంగా దూషణకు దిగేవారు?

– జర్నలిస్టులంతా బీఆర్ ఎస్ పక్షాన నిలబడి ఆ పార్టీపై ఈగ వాలితే,ప్రత్యర్థుల ‘చెంప చెళ్లుమనిపించాలి’ అని కూడా కేసీఆర్ విలేకరులను కోరిన సందర్భమూ ఉన్నది.

– అసలు జర్నలిస్టులు లేకపోతే తెలంగాణ ఉద్యమం ఎక్కడిది?

-కేసీఅర్ ఎక్కడ ఉండేవారు?

-2006/2007 లలో 1200 మంది జర్నలిస్టులకు పేట్ బషీరాబాద్,నిజాంపేట్ లలో నాటి సీఎం డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి 70 ఎకరాల భూమిని కేటాయించారు.కొన్ని కారణాలతో సుప్రీంకోర్టులో కేసు నడిచింది.జర్నలిస్టులు న్యాయపోరాటంలో విజయం సాధించారు.ఆ 70 ఎకరాలను జర్నలిస్టులకు ఇవ్వ వలసిందేనని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ తన పదవీ విరమణ వేళ చివరి తీర్పు ఇచ్చారు.

-సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని తండ్రీ+ కొడుకులు రాసుకున్న రాజ్యాంగంలో ఎక్కడుంది? కనుక అమలు చేయలేదు.2023 ఎన్నికల్లో జర్నలిస్టులు తోచినంతగా కసి తీర్చుకున్నారు.

-కొన్నేళ్ళ కిందట బుద్వేల్ దగ్గర భూమిని జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం చూశారు.జర్నలిస్టు సంఘాల నాయకులు,నాటి మీడియా ఆకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆ భూమి బాగుందని కేసీఆర్ కు తెలిపారు.

>అయితే బద్వేల్ భూములు కేటాయించకుండా అడ్డు పడింది ఎవరో! అందరికీ తెలుసు!

-పొరపాటున బీఆర్ ఎస్ మళ్ళీ అదికారంలోకి వచ్చి ఉంటే పేట్ బషీరాబాద్,నిజాం పేట్ భూములు ఖచ్చితంగా స్వాహా చేసేవారు.గుటుక్కున మింగేవారు.కాంగ్రెస్ అదికారంలోకి వచ్చింది కనుక జర్నలిస్టులు బతికిపోయారు.

-హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ జర్నలిస్టులకు తాము ఇండ్ల స్థలాలు ఇవ్వనందుకు,సుప్రీంకోర్టు తీర్పును ఖాతరు చేయనందుకు తండ్రీ+ కొడుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి.ముక్కు నేలకు రాయాలి.

టార్గెట్ మీడియా
అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పెద్దలు అనుకూలంగా లేని యాక్టివ్ జర్నలిస్టులను మరింత టార్గెట్ చేశారన్న చర్చ జరుగుతోంది. మేం కూడా 20 యూట్యూబ్ ఛానళ్లు పెడితే అంటూ ఓ వైపు ఛానళ్ళు, డిజిటల్ పత్రికలు, మీడియాను పెంచుకుంటూనే ఇంకో పక్క ఇలా జర్నలిస్టులపైనే దుష్టదాడి చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10