అల్చెట్టి నాగన్న, గంగారాం, ప్రమోద్ ఆధ్వర్యంలో కార్యక్రమం
అమ్మన్యూస్ ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో పార్టీ గతంలో ఎన్నడూలేనంతగా బలో పేతమవుతోంది. నిత్య చేరికలతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట జరుగుతున్న ఈ చేరికలతో పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. అల్చెట్టి నాగన్న, గంగారాం, ప్రమోద్ ఆధ్వర్యంలో కుంభఝరి,శివఘాట్, మత్తడి గూడ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాజీ సర్పంచ్ ఇందుబాయి రతన్ మాజీ ఉప సర్పంచ్ మంగళ విలాస్ తో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ బీజేపీ ల కు చెందిన కార్యకర్తలు కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారందరికి కండువాలు కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ..కాంగ్రెస్ పార్టీ గరీబోల్ల పార్టీ ఎక్కడ పేదలుంటారో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటదన్నారు. ప్రజలకు ఇండ్లు కట్టించేది, ఫించన్ లు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అన్నారు. కొత్త రేషన్ కార్డులు ,కొత్త ఫించన్ లు త్వరలో ఇస్తుందన్నారు. సెప్టెంబర్ 17 నుండి కొత్త రేషన్ కార్డుల కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు.అలాగే పేదలకు ఆరోగ్య శ్రీ కార్డు కూడా ప్రభుత్వం ఇస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ 1200 లకు పెంచిన గ్యాస్ సిలిండర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం 500 లకు ఇస్తూ పేదలకు అండగా నిలిచిందన్నారు. అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం , 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ సౌకర్యం అందిస్తూ ప్రజల విశ్వాసం పొందిందన్నారు. త్వరలో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కూడా మొదలవుతుందన్నారు.
మీఅందరి చేరికల వల్ల పార్టీ బలోపేత మవుతందని తెలిపారు. మరాఠి నాయకుడి రతన్ నేతృత్వంలో మరాఠ ప్రజల సమస్యల పరిష్కరం కోసం కృషి చేస్తానన్నారు. గ్రామనికి ఇలాంటి నాయకుడి అవసరం ఉందన్నారు. పేదల మంచి కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీని ఏ ఎన్నికలు వచ్చినా గెలిపించాలని కోరారు. గ్రామస్తులు ఎప్పుడు ఏ పని మీద ఆదిలాబాద్ కు వచ్చినా తన క్యాంపు ఆఫీస్ కొచ్చి బుక్కెడు బువ్వ తిని పోవాలని కోరారు.రానున్న సర్పంచ్, యంపీటీసి, జడ్పీటీసీ , మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులనే గెలిపించాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వెంట పెద్ద నాయకులెవరు లేకున్నా 50 వేల ఓట్లు వేసారని ఇప్పుడున్న బలం బలగం ఆనాడుంటే ఖచ్చితంగా గెలిచే వాడినన్నారు. తాను కేవలం ఆదిలాబాద్ అభివృద్ధి కోసమే రాజకీయాలలోకి వచ్చానని డబ్బు సంపాదనకు రాలేదన్నారు. తాను ఓడినా ప్రజల్లోనే ఉంటున్నానని ఎల్లప్పుడు ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేసారు.ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ బండారి సతీష్,మున్సిపల్ కో. ఆప్షన్ మెంబర్ ఇజ్జగిరి సంజయ్ కుమార్,నాయకులు పోరెడ్డి కిషన్,ఎం.ఏ షకీల్,ఎం.ఏ కయ్యుమ్,దాసరి ఆశన్న,మొహమ్మద్ రఫీక్,మానే శంకర్,బండారి చిన్నయ్య,శ్రీ రామ్,సార్ల సత్యనారాయణ,అశోక్,సమీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు