AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మేడారం జాతరకు జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లు .. ఏఏ ప్రాంతాల నుంచి నడుస్తాయంటే?

తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే మేడారం జాతర ఈనెల 21 నుంచి ప్రారంభమవుతుంది. ఈ జాతరకు దక్షిణ మధ్య రైల్వే జన్ సాధారణ్ రైళ్లను నడపుంది. దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ 10టీవీతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ఈసారి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 30 స్పెషల్ రైళ్లు నడుపుతున్నామని అన్నారు. గతంలో జాతరకు రాష్ట్రంలోని రెండు చోట్ల నుంచి మాత్రమే స్పెషల్ రైల్ సర్వీసులను నడిపడం జరిగిందని, ఈ సంవత్సరం జన్ సాధారణ్ రైళ్లు సికింద్రాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ మరియు సిర్పూర్ కాగజ్‌నగర్ మొదలయిన ఐదు ప్రాంతాల నుండి నడుస్తాయని చెప్పారు. ఈ రైళ్లు మార్గంలోని అన్ని ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని రాకేష్ చెప్పారు.

జాతర సందర్భంగా నడిపే రైళ్లలో అన్ రిజర్వుడు బోగీలే ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే సిపి‌ఆర్వో రాకేష్ చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం జన్ సాధారణ్ రైళ్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ స్పెషల్ రైళ్లతోపాటు రెగ్యూలర్ గా నడిచే రైళ్లు కూడా అందుబాటులో ఉంటాయని అన్నారు. ఆసియాలోనే అతిపెద్ద జాతర మేడారం జాతర కాబట్టి.. ప్రయాణీకుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు.

30 జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా..
10 రైళ్లు సికింద్రాబాద్ -వరంగల్- సికింద్రాబాద్ మధ్య నడుస్తాయి.
08 రైళ్లు సిర్పూర్ కాగజ్‌నగర్ -వరంగల్- సిర్పూర్ కాగజ్‌నగర్
08 రైళ్లు నిజామాబాద్ -వరంగల్- నిజామాబాద్
02 రైళ్లు ఆదిలాబాద్-వరంగల్- ఆదిలాబాద్
02 రైళ్లు ఖమ్మం -వరంగల్- ఖమ్మం
ఈసారి ఐదు స్టేషన్లు నుంచి జాతర స్పెషల్ రైల్ అందుబాటులోకి ఉంటాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10