జమ్మూ–కాశ్మీర్లో అత్యంత రాజకీయ ప్రాబల్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒమర్ అబ్దుల్లా. ఇతని తాత షేక్ అబ్దుల్లా, తండ్రి ఫరూక్ అబ్దుల్లాలు కూడా రాజకీయాల్లో ఆరితేరినవారు. ఈ ఇద్దరూ జమ్మూ–కాశ్మీర్‌కు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. ఇక ఒమర్ అబ్దుల్లా కూడా పాలిటిక్స్‌లో అత్యంత సక్సెస్ అయ్యారు. వారసత్వాన్ని అందపుచ్చుకున్న ఈయన 28 ఏళ్ళ వయసులో లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై అత్యంత పిన్నవయసు ఎంపీగా రికార్డ్ సాధించారు. అదొక్కటే కాదు అత్యంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత కూడా ఒమర పేరటి ఉంది. 38 ఏళ్ళ వయసులో ఒమర్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. 2008 లో కాంగరెస్తో కలిసి ప్రబుత్వాన్ని స్థాపించారు ఒమర్.
వ్యక్తిగత జీవితం…
1970లో పుట్టిన ఒమర్ అబ్దుల్లా తండ్రి ఫరూక్ అబ్దుల్లా, తల్ల మోలీ. ఒమర్ శ్రీనగర్‌లోని సోన్వార్ బాగ్‌లో ఉన్న బర్న్ హాల్ స్కూల్లో, సనావర్‌లోని లారెన్స్ స్కూల్లో చదువుకుతన్నారు . ఆ తర్వా సిడెన్హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో బీకామ్ చేశారు.ఈయన రాజకీయాల్లోకి రాకముందు 29 ఏళ్ళ వరకూ ITC లిమిటెడ్ , ది ఒబెరాయ్ గ్రూప్‌లో ఉద్యోగం చేసారు . దాని తర్వాత ఒమర్ స్ట్రాత్‌క్లైడ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏను ప్రారంభించారు. అయితే ఈ సమయంలోనే ఆయన లోక్‌సభకు ఎన్నికవడంతో చదువును మధ్యలోనే ఆపేశారు. ఢిల్లీకి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ రామ్‌నాథ్ కుమార్తె పాయల్‌ను పెళ్ళిచేసుకొన్నారు. కానీ కొన్నేళ్ళకు వారిద్దరూ విడిపోయారు.
ఒమర్ సహజంగా మంచి వక్త. చాలా విషయాల మీద పట్టు ఉందని చెబుతారు. 2008లో లోక్‌సభ విశ్వాస తీర్మానం సందర్భంగా ఒమర్ చేసిన ప్రసంగం సూపర్ హిట్ అయింది. కొన్నిరోజల పాటూ ఇది ఇంటర్నెట్లో హల్ చల్ చేసింది. ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్‌క్లూజివ్ అయన్స్లో ఒమర్ కొన్నాళ్ళపాటూ కో ఆర్డినేషన్ సభ్యునిగా ఉన్నారు.
రాజకీయ జీవితం…
ఒమర్ కుటుంబానికి రాజకీయాతో ఒప్పట నుంచో సంబంధం ఉంది. దానిని ఆధారంగా చేసుకునే తల్లికి ఇష్టం లేకపోయినా ఒమర్ పాలిటిక్స్‌లోకి వచ్చారు. 1998లో లోక్‌సభకు ఎన్నికైన యన అప్పటి వాజ్‌పేయ్ ప్రభుత్వంలో రవాణా, పర్యాటక కమిటీ..పర్యాటక మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ రెండింటిలోనూ సభ్యుడుగా పనిచేశారు. ఆ తరువాత ఎన్నికల్లోనూ విజయం సాధించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధయతలు నిర్వర్తించారు. 2001ల విదేశాంగ శాఖ సహాయమంత్రిగా నియమింపబడ్డారు. అయితే తరువాత జమ్మూ–కాశ్మీర్లో సొంతపార్టీ అయిన ఎన్సీ పార్టీ మీద దృష్టి పెట్టడం కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారు. తండ్రి తర్వాత పార్టీ అధ్యక్షుడు అయ్యారు. సెప్టెంబరు-అక్టోబర్ 2002లో జరిగిన కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో ఒమర్ అబ్దుల్లా తన గందర్బాల్ స్థానాన్ని కోల్పోయాడు. 2006లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. 2008 కాశ్మీర్ ఎన్నికల తర్వాత , నేషనల్ కాన్ఫరెన్స్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. దీంతో ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒమర్ జమ్మూ– కాశ్మీర్ 11వ ముఖ్యమంత్రిగా 2009 జనవరి 5న జనరల్ జోరావర్ సింగ్ ఆడిటోరియంలో ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రస్తుత ఎన్నికలు..
2019 వరకు జమ్మూ–కాశ్మీర్ ఒకటి…దాని తర్వాత మరొకటి. 2019లో ఇక్కడ అమల్లో ఉన్న ఆర్టికల్ 370ను రద్దు చేశారు. దీని ప్రకారం జమ్మూ–కాశ్మీర్‌కు ఉన్న కేంద్రపాలిత హోదాను తీసేసి రాష్ట్ర హోదాను కల్పించారు. ఆ తర్వాత ఇక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటిల్లో బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీల మధ్య ప్రధాన పోటీ జరిగింది. కాంగ్రెస్, ఎన్సీలు కలిసి పోటీ చేశాయి. అయినప్పటికీ కూడా ఒమర్ నాయకత్వం వహించిన ఎన్సీ పార్టీనే ఎక్కువ స్థానాల్లో గెలిచింది. అందుకే ఇప్పుడు ఒర్ అబ్దుల్లానే జమ్మూ–కాశ్మీర్‌కు కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.