సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన వేళ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవలే ఏలూరు, విశాఖపట్నం జిల్లాకు చెందిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇది మరింత జోరందుకుంది. రెండు రోజుల కిందటే విశాఖపట్నానికి చెందిన టీడీపీ సీనియర్ నేత గంపల వెంకట రామచంద్ర రావు, ఆయన భార్య సంధ్యా రాణి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆయనకు విశాఖపట్నం దక్షిణ, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గాలపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఇదివరకు టీడీపీ ఎన్నికల ఇన్‌ఛార్జీగా పనిచేశారు.
అంతకుముందు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జాయింట్ సెక్రటరీగా, ఓబీసీ విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వ్యవహరించారు. సెన్సార్ బోర్డు సభ్యుడు, వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. కేంద్రమంత్రి శోభపై చర్యలకు ఆదేశించిన ఈసీ: ఎందుకంటే? విశాఖపట్నానికే చెందిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు వైసీపీలో చేరారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పని చేశారు. ఆ తరువాత నెల్లూరుకు చెందిన మలిరెడ్డి కోటారెడ్డి వైసీపీ కండువా కప్పుకొన్నారు. నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీతో పాటు జిల్లాలోని పలు నియోజకవర్గాలపై పట్టున్న నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి జగన్‌మోహన్ రెడ్డి , కార్యదర్శి రావూరు లక్ష్మీనారాయణ శాస్త్రి.. వైఎస్ఆర్సీపీ గూటికి చేరారు. మద్దిరెడ్డి గతంలో బాపట్ల పార్లమెంట్ ఇన్‌ఛార్జీగా పనిచేశారు. లక్ష్మీనారాయణ శాస్త్రికి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఉంది. వారిద్దరినీ జగన్ స్వయంగా పార్టీలో ఆహ్వానించారు.
తాజాగా రాధా- రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర వైఎస్ఆర్సీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను కలిశారు. ఆయన చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పుకొన్నారు. వంగవీటి రాధాకు ఆయన సోదరుడి వరుస అవుతారు. వంగవీటి మోహనరంగా అన్న నారాయణరావు కుమారుడే నరేంద్ర. చాలాకాలంగా ఉమ్మడి కృష్ణాజిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటోన్నారు. రాధా- రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తోన్నారు. కాపు సామాజిక వర్గం ఓటుబ్యాంకుపై ఆయనకు గట్టి పట్టు ఉంది. అలాంటి నాయకుడు తాజాగా వైఎస్ఆర్సీపీలో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది.