అమరావతి : ఏపీ ఎన్నికల్లో మరోసారి వైసీపీ విజయఢంకా మ్రోగించనుందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జూన్ 9న రెండోసారి ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా విశాఖలో చేయనున్నారని తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జగన్ ఆదేశాల మేరకు ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు పూర్తిగా సంయమనం పాటించారని తెలిపారు. అన్నింటిని క్షుణ్ణంగా తెలుసుకుని, అవగాహన పెంచుకుని పథకాలు ప్రారంభిస్తారని తెలిపారు. విద్య, వైద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. పోలింగ్ రోజున మహిళలు, వృద్దులు, యువకులు భారీ సంఖ్యలో వచ్చి అధికార వైసీపీకి ఓట్లు వేశారని తెలిపారు. ప్రజల్లో చైతన్యం రావడం వల్లే రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరిగిందని బొత్స పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నా చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.