జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న వారిలో పంచ్ ప్రసాద్ ఒకడు. తన పంచులతో ఎంతో మందిని నవ్వించిన ఆయన గతంలో ఎన్నో షోలు చేస్తూ బిజీగా ఉండేవాడు. అయితే.. కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న ప్రసాద్.. ఇటీవల చికిత్స చేయించుకుని ఇప్పుడు కోలుకున్నాడు. క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పంచ్ ప్రసాద్ తన భార్య గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
పంచ్ ప్రసాధ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో ఎంతగానో బాధపడ్డాడు. కిడ్నీ మార్పిడి కోసం ప్రయత్నించగా.. డోనర్ దొరకక తన భార్య కూడా కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇక ఏపీ ప్రభుత్వం చొరవతో ప్రసాద్ భార్య కిడ్నీ ఇవ్వకుండానే.. అతడికి కిడ్నీ మార్పిడి జరిగింది. ఇక చికిత్స అనంతరం విశ్రాంతి అవసరం ఉండటంతో.. ప్రసాద్ ఈ మధ్య కాలంలో టెలివిజన్ షోలలో కనిపించడం మానేశాడు. అంతేకాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు కూడా దూరమయ్యాడు.
ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉండటంతో.. తాజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ప్రేమించి పెళ్లి చేసుకున్న సునీత ఇప్పుడు నన్ను ఛీ అంటుంది. నా కామెడీ పంచులు నచ్చి నాకు అభిమాని అయ్యి.. నన్ను పెళ్లి చేసుకుంది సునీత. కానీ ఇప్పుడు నా పంచులు నచ్చడం లేదట. అందుకే ఛీ అంటుంది. చికిత్స తర్వాత నేను కోలుకున్నాను. కానీ నా భార్య సునీత అనారోగ్యం బారిన పడింది’ అంటూ చెప్పుకొచ్చాడు పంచ్ ప్రసాద్.