తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 9 ఏడాది పూర్తి కావస్తుంది. అందుకు సంబరాలను నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. నవంబర్ 14 నెహ్రూ పుట్టినరోజు నుంచే ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. మొత్తం 26 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో సంబరాలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనికోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ శనివారం రోజు సచివాలయంలో సమావేశమైంది.
గత సంవత్సర కాలంలో దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో జరిగాయని అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విప్లవాత్మక ఊహకందని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఈ సంవత్సరంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను షోకేస్ చేస్తూ ప్రభుత్వం యొక్క లక్ష్యాలను ప్రచారం చేయనున్నారు. మహిళలకు ఉచిత బస్సు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ₹500 గ్యాస్ సిలిండర్ వచ్చిన ఆరు నెలల్లోనే 18 వేల కోట్ల రుణమాఫీ, పంట బీమా, మహిళా సంఘాలకు 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇలా వీటన్నింటిని భారీగా ప్రచారం చేయనున్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు అయిన నవంబర్ 14న ఉత్సవాలన ప్రారంభించి డిసెంబర్ 9న హైదరాబాదులో వేలాదిమంది కళాకారులతో సందడి చేయనున్నారు.
లేజర్ షో క్రాకర్స్ షో ఇలా ఎన్నో స్పెషల్ ఎట్రాక్షన్స్ ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 9 రోజు ఈ మధ్య నిర్వహించిన గ్రూప్ 4 లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలని నిర్ణయించారు. వివిధ శాఖలకు చెందిన పోలీసు విధానాల ప్రకటన పలు ఒప్పందాలపై సంతకాలు, క్రీడా విశ్వవిద్యాలయానికి ఫౌండేషన్ కార్యక్రమం 16 నర్సింగ్ కళాశాలలో 28 పారామెడికల్ కాలేజీలకు ప్రారంభోత్సవం కూడా చేయనున్నారు. గోషామహల్ లో పోలీస్ గ్రౌండ్స్ లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం కూడా డిసెంబర్ 9న చేయబోతున్నారు. దాంతోపాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా అదే రోజు లాంచ్ చేయబోతున్నారు.