AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి పతకం

భారత పురుష రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌ అదరగొట్టాడు. 57 కేజీల విభాగం కాంస్య పోరులో డారియన్‌ (ప్యూర్టోరికా)పై 13-5 తేడాతో ఘన విజయం సాధించాడు. దీంతో ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున రెజ్లింగ్‌లో తొలి పతకాన్ని అమన్‌ సాధించాడు. ఈ గెలుపుతో ఇప్పటి వరకు భారత్‌ ఖాతాలో మొత్తం 6 ఒలింపిక్స్‌ మెడల్స్‌ చేరాయి. ఇందులో ఒక రజతం, ఐదు కాంస్యాలు ఉన్నాయి. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో 10-0తో మాజీ యూరోపియన్‌ ఛాంపియన్‌ వ్లాదిమిర్‌ ఎగోరోవ్‌ (ఉత్తర మెసెడోనియా), క్వార్టర్స్‌లో 12-0తో మాజీ ప్రపంచ ఛాంపియన్‌ జెలిమ్‌ఖాన్‌ (అల్బేనియా) నెగ్గిన అమన్‌.. సెమీస్‌లో అయిదో సీడ్‌ రీ హిగుచి (జపాన్‌) చేతిలో 0-10 తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే కాంస్య పోరులో మాత్రం సెహ్రావత్‌ దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థికి అవకాశాలు ఇవ్వకుండా చాకచాక్యంగా వ్యవహరించాడు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10