AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గత ప్రభుత్వంలో ‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌’ నిర్వీర్యం.. మండలిలో మంత్రి సీతక్క

పేరుకుపోయిన రూ.5,197కోట్ల ఫీజు బకాయిలు
త్వరలో క్లియర్‌ చేసేందుకు చర్యలు

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నిర్వీర్యం చేసిందని దీంతో రూ.5,197కోట్ల ఫీజు బకాయిలు పేరుకుపోయాయని మంత్రి సీతక్క మండిపడ్డారు. మంగళవారం శాసన మండలిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై సభ్యులు వాణి, ఏవీఎన్‌ రెడ్డిలు అడిగిన ప్రశ్నలపై మంత్రి సమాధానమిచ్చారు.

గొప్ప లక్ష్యంతో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తే..
చదువు కొనలేని పేదలకు చదువు భారం కాకుడదన్న ఉద్దేశంతో.. పేద వర్గాల పిల్లలకు కార్పోరేట్, ఉన్నత విద్యను అందించేందుకు గొప్ప లక్షంతో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 2007 లో ఫీ రీయింబర్స్‌ మెంట్‌ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం ద్వారా పేదింటి బిడ్డలు ఉన్నత విద్య అభ్యసించి, ఉన్నత ఉద్యోగాల్లో స్థిర పడ్డారని మంత్రి సీతక్క తెలిపారు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఫీజు చెల్లింపు పథకం కొనసాగినా..సకాలంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో వేల కోట్ల బకాయిలు గుట్టలుగా పేరుకుపోయాయని అన్నారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పేరుకుపోయిన బకాయిలు ఇలా..
2019–20 లో 40 కోట్లు
2020–21 లో 209 కోట్లు
2021–22 లో 981 కోట్లు
2022–23 లో 2120 కోట్లు
2023–24 లో 1845 కోట్లు..

మొత్తంగా రూ. 5,197 కోట్లు ఫీజు బకాయిలు పేరుకుపోయాయని మంత్రి వివరించారు.

విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం..
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కాకపోవడంతో వనపర్తి జిల్లాలో లావణ్య అనే దళిత ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని, బకాయిలతో విద్యార్థులు ఇబ్బందుల్లో పడ్డారన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలను క్లియర్‌ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించారన్నారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని, ఫీజు రీయింబర్స్‌ మెంట్, బీఆర్‌ఎస్‌ పెండింగ్‌ ఫీజు బకాయిలను సైతం చెల్లిస్తామని మంత్రి సీతక్క తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10