పాఠశాలలు, గురుకులాల్లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశం
పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని అందించాలన్న రేవంత్
కలెక్టర్లకు కీలక సూచనలు
ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బాధ్యులపై వేటు వేయాలని కలెక్టర్లను ఆదేశించారు. పాఠశాలలు, హాస్టళ్లను తరచూ తనిఖీ చేయాలన్నారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని సిబ్బందిని హెచ్చరించారు. పరిశుభ్రమైన వాతావరణంలో వంట చేయాలని సూచించారు. పదే పదే హెచ్చరించినా మార్పు రాకపోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. వెంటనే తనకు నివేదిక పంపాలని ఆదేశించారు.
విద్యార్థులకు పెట్టే భోజనంలో నిర్లక్ష్యం వహించినట్టు తేలితే ఉద్యోగాలను కూడా తొలగిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించినా అధికారులు, సిబ్బంది తీరుమారడం లేదు. మెస్ చార్జీలు పెంచామని విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని హెచ్చరించారు. లేదంటూ చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎం వార్నింగ్ ఇచ్చి నెల రోజులు కూడా అవ్వడంలేదు. ఇంతలోనే కొమురంభీం జిల్లాలో ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థిని మృతి చెందడం సంచలనంగా మారింది.