AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కుమార్తె జైల్లో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా?: కేసీఆర్ భావోద్వేగం

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత జైలులో ఉండటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గులాబీ బాస్​కేసీఆర్ అధ్యక్షత ఆ పార్టీ శాసనసభా పక్షం సమావేశమైంది. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్​‌లో జరిగిన ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్​పార్టీ హామీల అమలు, ప్రజాసమస్యలను లేవనెత్తడం ద్వారా బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. ఉభయ సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, లేవనెత్తిన విషయాలపై మార్గనిర్దేశం చేశారు.

అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గతంలో జరిగిన సమావేశానికి అనారోగ్యం కారణంగా కేసీఆర్ హాజరు కాలేదు. అయితే, ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. బీఆర్​ఎస్​ఎల్పీ మీటింగ్ అనంతరం కేసీఆర్.. కవిత అరెస్ట్‌పై స్పందించారు. రాజకీయ కక్షతోనే తన కుమార్తె కవితను జైల్లో పెట్టారని, సొంత కుమార్తె జైల్లో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా? అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. తాను అగ్నిపర్వతంలా ఉన్నట్లు పేర్కొన్నారు. పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవని, ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లోనే తెలంగాణ సాధించామని కేసీఆర్ చెప్పారు. కేంద్ర బడ్జెట్‌పై కిషన్ రెడ్డి ఏమన్నారంటే? పార్టీ ఫిరాయింపులు, కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ ఫైర్ నలుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యే, బాగా ఎదుగుతారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ సర్కార్ పాలనపై పట్టు సాధించలేకపోయిందని, పాలనపై దృష్టి పెట్టకుండా బద్నాం చేసే పనిలో ఉన్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు నెలల రేవంత్​పాలనలోనే శాంతి భద్రతలు ఎందుకు అదుపుతప్పుతున్నాయని కేసీఆర్ ప్రశ్నించారు. మరోవైపు, పార్టీ ఫిరాయింపుల అంశంపైనా కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ఎక్కడో ఉన్న వారిని నేతలను చేస్తే, పదవులు వచ్చాక పార్టీని వీడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ వదిలి వెళ్లే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ అన్నట్టు తెలిసింది. మరోవైపు, ఈ అసెంబ్లీ సమావేశాలకు శాసనమండలిలో బీఆర్​ఎస్​పక్ష నేతగా మధుసూదనాచారిని ప్రకటించారు కేసీఆర్.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10