సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల విషయంలో వైసీపీ కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో, నటి శ్రీరెడ్డి ఆసక్తికర వీడియోతో తెరపైకి వచ్చారు. గతంలో చేసిన వ్యాఖ్యలకు… లోకేశ్ కు, పవన్ కల్యాణ్ కు, అనితకు సారీ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. వారి కుటుంబ సభ్యులకు కూడా సారీ చెబుతున్నానని వెల్లడించారు.
“నా కుటుంబాన్ని, నా భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. నాకు భవిష్యత్తేమీ లేదనుకోండి… నేనేమీ పెళ్లి, పెటాకుల గురించి ఆలోచించడంలేదు. నా వల్ల నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని కోరుకుంటున్నాను. ఇక నుంచి నా సోషల్ మీడియా ఖాతాలో మీ కుటుంబ సభ్యుల గురించి ఎలాంటి తప్పుడు ప్రచారం జరగదు అని హామీ ఇస్తున్నాను.
సోషల్ మీడియా పోస్టులపై యుద్ధాన్ని నేతల స్థాయిలో చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నాతో సహా మా కార్యకర్తలను దయచేసి వదిలిపెట్టండి” అంటూ శ్రీరెడ్డి తన వీడియో సందేశంలో పేర్కొన్నారు.
చంద్రబాబు,లోకేష్,పవన్ కళ్యాణ్ సారీ..! ఇక నుంచి మీ కుటుంబసభ్యుల గురించి మాట్లాడను.. – శ్రీ రెడ్డి #Srireddy #ChandrababuNaidu #PawannKalyan #RTV pic.twitter.com/4aMrlbGbn9
— RTV (@RTVnewsnetwork) November 8, 2024