లగచర్ల ఘటన నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీల నేతలు సీఎం రేవంత్ రెడ్డితో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లగచర్లలో తాము పర్యటించి పరిశీలించిన విషయాలను సీఎం దృష్టికి తీసుకునివెళ్లారు. అక్కడ రెండు పంటలు పండే భూములు ఉన్నాయని సీఎంకు చెప్పారు. రైతులను ఇబ్బంది పెట్టవద్దని అన్నారు. రైతుల తరఫున వినతీపత్రాన్ని అందజేశారు. దీంతో సొంత నియోజకవర్గ ప్రజలను నేనే ఎందుకు ఇబ్బంది పెడతానని సీఎం వారితో చెప్పారు.
కొడంగల్ ఓ ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్ అని వివరించారు. నియోజకవర్గంలోని యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని తెలిపారు. కాలుష్య రహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని, భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. లగచర్లలోని భూములనే తీసుకోవాలని లేదని ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. రైతుల బాధలు తనకు తెలుసని, తను కూడా రైతు కుటుంబం నుండే వచ్చానని అన్నారు. అమాయక రైతులపై కేసుల విషయం లో పరిశీలిస్తామని చెప్పారు. కుట్ర చేసిన వాళ్ళను వదిలిపెట్టమని హెచ్చరించారు.
మహబూబ్ నగర్ జిల్లా చాలా వెనకబడిందని యువతకు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని సీఎం కమ్యూనిస్టుల నేతలకు చెప్పారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకే పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భూముల సేకరణలో మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. వామపక్ష నేతలు ఇచ్చిన రిపోర్టును పరిశీలిస్తామని సీఎం తెలిపారు. మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వం కుట్ర చేస్తున్నాయని నేతల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.