AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేను ఒప్పుకోను.. కేసు వేస్తున్నా.. కేఏ పాల్

తెలంగాణ మంత్రి కొండా సురేఖ తాజాగా నాగార్జున ఫ్యామిలీకి సంబంధించిన అంశంపై చేసిన కామెంట్స్ పై సర్వత్రా విమర్శలు రాగా.. మంత్రి సారీ చెప్పారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపగా.. ఆ సెగ టాలీవుడ్ ని సైతం తాకింది. ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రముఖులు సైతం ఘాటుగా స్పందించారు. కొండా సురేఖ సారీ ప్రకటన కేవలం హీరోయిన్ సమంతను ఉద్దేశించి ఉందని, నాగార్జున ఫ్యామిలీకి చెప్పినట్లు లేదని టాలీవుడ్ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా దుమారం రేగిన మంత్రి కొండా వ్యాఖ్యలపై తాజాగా ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ స్పందించారు.

కేఏ పాల్ మాట్లాడుతూ.. రాజకీయ విమర్శలు చేసే సమయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరాన్ని నేతలు విస్మరిస్తున్నారన్నారు. అలాగే మంత్రి కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పడం వరకు బాగానే ఉందని, ఇక ఆమె మంత్రి పదవిలో ఉండే అర్హత కోల్పోయారన్నారు. మంత్రి కొండాకు మతిభ్రమించిందని.. 72 గంటల్లో ఆమె రాజీనామా చేయాలని పాల్ ఘాటుగా స్పందించారు. తాను ఈ విషయంలో న్యాయ నిపుణులతో మాట్లాడి కేసు వేస్తానని కూడా హెచ్చరించారు. అయితే సారీతో సరిపోయే మాటలు కావని, సమంత, నాగార్జున లాంటి ప్రముఖుల ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాలని ఆయన సూచించారు. పాల్ డిమాండ్ పై మంత్రి కొండా సురేఖ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10