అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా (Hydra).. మణికొండ మున్సిపాలిటీ లో దూకుడు పెంచింది. అల్కాపురి కాలనీ లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కమర్షియల్ షెట్టర్స్ ను అధికారులు తొలగించారు . రెసిడెన్షియల్‌గా అనుమతులు తీసుకుని కమర్షియల్‌గా వ్యాపార సముదాయాలు నడిపిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో గత వారం హైడ్రా కమీషనర్ రంగనాథన్ అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ అదేశాల మేరకు అక్రమంగా నడుస్తున్న వ్యాపార సముదాయాలను గురువారం తొలగించారు. ఈ క్రమంలో అధికారులకు వ్యాపారస్తులకు మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మణికొండ మునిసిపాలిటీకి లక్షల రూపాయలు కమర్షియల్ ట్యాక్స్ చెల్లించామని, ఎలా కూల్చివేస్తారంటూ వ్యాపారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ బాడా వ్యక్తి ఒత్తిడి మేరకు కూల్చివేతలు చేసారంటూ వ్యాపారుల ఆందోళన చేపట్టారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారంటూ వ్యాపారులు మండిపడ్డారు.
మణికొండ కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ స్పందన..
అల్కాపురి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అధికారులు కమర్షియల్ షెట్టర్స్ తొలగింపుపై హైడ్రా కమీషనర్ రంగనాథన్ స్పందించారు… వ్యాపారస్తులు హైడ్రా కమిషనర్‌పై చేస్తున్న వాఖ్యలను ఖండించారు. పనికి మాలిన మాటలను వాస్తవాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని, వీటన్నింటి వెనుక స్థానిక బిల్డర్ ఉన్నారని అన్నారు. మేము వివరంగా పత్రికా ప్రకటనను విడుదల చేస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు.
కాగా రాష్ట్రంలో చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) తీసుకున్న సంచలన నిర్ణయమే హైడ్రా (HYDRA). ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న చాలా అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేస్తోంది. రాష్ట్ర చరిత్రలోనే హైడ్రా ఏర్పాటు చేసిన 100 రోజుల వ్యవధిలోనే 300 అక్రమ నిర్మాణాలకు పైగా నేలమట్టం చేసింది. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం జూలై 19వ తేదీన హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 99ను తీసుకువచ్చింది. దీంతో జూలై 26 నుంచి కూల్చివేతలను మొదలుపెట్టింది హైడ్రా. ఇప్పటి వరకు 30 ప్రాంతాల్లో 300 ఆక్రమణలను కూల్చివేసింది. 100 రోజుల్లో 120 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగింది.