నల్లగొండ: ఓ రాజకీయ నాయకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్య గుట్టును రట్టు చేశాడు ఓ భర్త. అర్ధరాత్రి పక్కా ప్లాన్‌తో కుటుంబ సభ్యులతో కలిసి వీరి బాగోతాన్ని బట్టబయలు చేశాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లిలో చోటు చేసుకుంది. భార్యను(Wife), ఆమె ప్రేమికుడిని(Lover) ఇద్దరినీ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లిలో ఓ నాయకుడుతో ఓ వ్యక్తి భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. నాలుగేళ్లుగా వీరి వ్యవహారం కొనసాగుతుండగా.. శనివారం అర్ధరాత్రి వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు భర్త, అతని కుటుంబ సభ్యులు. పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే, వీరి వ్యవహారాన్ని అంతకు ముందే గుర్తించిన భర్త.. గతంలో పలుమార్లు భార్యను హెచ్చరించాడు. అయినా తీరు మారకపోగా.. భర్తను చంపేందుకు ప్లాన్ చేశారు. ఇదే విషయంపై పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ కూడా ఇచ్చాడు భర్త. కానీ, అతనిపై పోలీసులు రివర్స్ కేసు పెట్టి 20 రోజులు జైల్లో ఉంచారని బాధిత భర్త ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని భావించాడు భర్త. ఇందుకోసం తన కుటుంబ సభ్యుల సహాయం తీసుకున్నాడు. శనివారం రాత్రి ఇద్దరూ ఏకాంతంగా ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. వారిద్దరినీ చితక్కొట్టి.. అనంతరం పోలీసులకు అప్పగించారు.