బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటుతుండగా.. వేడితో అల్లాడుతున్న ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్‌వాసులను వరుణుడు కరుణించాడు.మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో అల్లాడిన నగర వాసులను వాన జల్లలు పలకరించాయి. దీంతో వాతవరణం చల్లబడి ఉపశమనాన్నిచ్చింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్‌బాగ్, అబిడ్స్, కోఠి, సరూర్ నగర్, కొత్తపేట, మలక్‌పేట పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.
అలాగే, జూబ్లీహిల్స్, మాదాపూర్, యూసఫ్ గూడ, కీసర, ఘట్‌కేసర్, అబ్దుల్లాపూర్ మెట్, నాంపల్లి, ఖైరతాబాద్, మెహదీపట్నం, దిల్‌సుఖ్ నగర్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్, షేక్‌పేట తదితర ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. ఓవైపు, సద్దుల బతుకమ్మ వేడుకలు.. మరోవైపు, వర్షం కూడా కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఐటీ కారిడార్‌లో కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరాయి. వాహనాల రాకపోకలను సజావుగా సాగేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. ఇక, గురువారం రాత్రి కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు.
Raining Heavily here in #Khajaguda Circle ⛈️#HyderabadRains pic.twitter.com/lfgEuHrdZe
— Hyderabad Rains (@Hyderabadrains) October 10, 2024