నాన్ వెజ్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. చికెన్ ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. గత నెలలో విపరీతంగా పెరిగిన చికెన్ ధరలు..గత వారం రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. శ్రావణ మాసం ఎఫెక్ట్ చికెన్ ధరలపై పడడంతో చికెన్ రేట్ అమాంతం దిగొచ్చింది. ఇక ఆదివారం వస్తే..చాలామంది ముక్కలేనిది ముద్ద దిగదు అనుకునే వారు.. చికెన్ రేటు తగ్గడంతో షాపుల ముందు క్యూ కడుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కేజీ లైవ్ కోడి ధర రూ.110 నుంచి రూ.120 విక్రయిస్తున్నారు. స్కిన్ లేకుండా రూ.150 నుంచి రూ.160 ఉండగా..స్కిన్ చికెన్ ధర రూ.130 నుంచి రూ.140 వరకు విక్రయిస్తున్నారు. రానున్న రోజులు ఇంకా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గతకొంతకాలంగా ఉన్న ధరలలో ఇదే కనిష్ట ధర కావడం విశేషం.
అలాగే, హిందువులు శ్రావణమాసంలో ఎంతో నిష్టగా ఉంటారు. వత్రాలు, ఉపవాసాలు ఉండడంతో నాన్ వెజ్ కు దూరంగా ఉంటారు. దీంతో చికెన్ తినే వారి సంఖ్య క్రమంగా తగ్గుమఖం పట్టింది. దీంతో చికెన్ ధరలపై ఎఫెక్ట్ పడింది. అయితే కోడిగుడ్డు ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ప్రస్తుతం కోడి గుడ్డు ధర రూ. 5 అమ్ముతున్నారు. ఇదిలా ఉండగా, మటన్ ధర కేజీ రూ.800 నుంచి రూ.1000 వరకు పలుకుతోంది.