కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్న కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఇవ్వగానే 14 మంది కుటుంబ సభ్యులతో వెళ్లి సోనియాగాంధీ కాళ్లు మొక్కిన సంగతి మరిచిపోయావా అంటూ ఫైర్ అయాయరు. సోనియాకు కృతజ్ఞత తెలపాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోయిందన్నారు.
అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు..
ఈ మేరకు సోమవారం అసెంబ్లీ లాబీలో తెలంగాణ ఆవిర్భావంపై మాట్లాడారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ పుట్టినరోజున అసెంబ్లీకి వచ్చి ఆమెకు కృతజ్ఞతలు తెలపరా? అంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. అసెంబ్లీలో తెలంగాణ ఇచ్చిన దేవత అని, సోనియాగాంధీ లేకపోతే తెలంగాణ రాదని అన్న కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని మండిపడ్డారు.
బీఆర్‌ఎస్‌కు నైతికత లేదు..
‘బీఆర్‌ఎస్ పార్టీకి మాట్లాడే నైతికత లేదు. మేము ఇప్పటికి టీపీపీపీ అని చెప్పుకుంటాం. నీ పార్టీలో టీ తీసేసి బీఅర్‌ఎస్ అని పెట్టుకున్నావ్. నిజామాబాద్ జిల్లాకు వెళ్ళినపుడు రివ్యూ కి ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాలేదు. మా పార్టీ ఆర్మూర్ ఇన్‌చార్జి వచ్చి రోడ్డు సమస్య ఉందని చెప్పారు. అందులో ఎం తప్పు ఉంది. నా కొడుకు మృతితో ఎంత బాధ పడ్డానో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేయాలని అంత బాధ పడ్డానని ఎమోషనల్ అయ్యారు.