AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హ‌రీష్.. అబ‌ద్ధాలు మానుకో.. మంత్రి సీత‌క్క తీవ్ర ఆగ్ర‌హం

జగిత్యాల జిల్లా తొంబరావుపేట గ్రామంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి సంబంధించి 17 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లుగా ఒక పత్రికలో కథనం రావటం, దాన్ని క‌నీసం చెక్ చేసుకోకుండానే మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేయడం పట్ల మంత్రి సీత‌క్క తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

నిత్యం మీడియా, సోష‌ల్ మీడియాలో ఉండేందుకు పాకులాడుతూ, త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌డాన్నే హ‌రీష్ ప‌నిగా పెట్టుకున్నార‌ని మండిప‌డ్డారు. గత నెల 19 నే మాజీ స‌ర్పంచ్ మామిడి స‌త్త‌మ్మ‌కు రూ.7,46,787 చెక్‌ల‌కు ఇవ్వ‌గా 23 అక్టోబ‌ర్‌న విత్ డ్రా చేసుకున్న‌ట్లు అధికారులు మంత్రి సీత‌క్క దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పూర్తి కాలేదని, ప్లాస్టరింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, పనులు పూర్తి చేసిన తర్వాత బిల్లులు స‌మ‌ర్పించాల‌ని మాజీ స‌ర్పంచ్‌కు అధికారులు సూచించగా, ఇప్ప‌టి వ‌ర‌కు బిల్లులు స‌మ‌ర్పించ‌లేద‌ని జిల్లా అధికారులు మంత్రికి నివేదిక సమ‌ర్పించారు. దీనిపై మంత్రి సీత‌క్క తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

వాస్త‌వాలు తేలుసుకోకుండా హ‌రీష్ రావు ట్వీట్ చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. లేని అంశాలున్న‌ట్లు భ్ర‌మింప చేయ‌డాన్ని హ‌రీష్ రావు మానుకోవాల‌ని సూచించారు. అవ‌స్త‌వాల‌ను ప్ర‌చారం చేసి అధికారంలోకి వ‌చ్చేందుకు హ‌రీష్ ఆరాట ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10