కేసీఆర్ ప్రభుత్వానికి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత హరీష్‌రావు కూడా ఉండడం డౌటే అని … బీజేపీలోకి (BJP) పోతారంటూ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారని తెలుస్తోందన్నారు. ‘‘ప్రతిపక్ష నాయకుడి హోదా కొడుకుకు ఇస్తే అల్లుడు పోతాడు… అల్లుడుకిస్తే కొడుకు పోతాడు’’ అంటూ ఎద్దేవా చేశారు.
కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే శక్తి లేకే అసెంబ్లీ రావడం లేదన్నారు. మీలాగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే మిగిలేది నలుగురే అని చెప్పుకొచ్చారు. ప్రధాన మంత్రి రాష్ట్రానికి వస్తే కలిసి వినతిపత్రం ఇవ్వాలన్నారు. మోదీ జేబులోంచి ఇవ్వడం లేదని.. అది ప్రజల సొమ్మే అని అన్నారు. కేసీఆర్‌కు దిక్కులేక ఆర్.ఎస్.ప్రవీణ్ (RS Praveen) కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ (LRS) గైడ్ లైన్స్ పూర్తి కాలేదన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే మోదీ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.