బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. హస్తం గూటికి చేరుతానంటూ అప్పట్లోనే దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డితో మొరపెట్టుకున్నారని చెప్పారు. అందుకే కేసీఆర్ దూరం పెడుతున్నారన్నారు.
ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆది శ్రీనివాస్.. కాంగ్రెస్‌లో చేరేందుకు హరీష్ రావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసి పార్టీలో చేరుతానని మొర పెట్టుకున్నారి గుర్తు చేశారు. ఆ సమయంలో విషయం గమనించిన కేసీఆర్ హరీష్ రావును దూరం పెట్టారని చెప్పారు. ఇప్పుడు కాళేశ్వరరావు ఇప్పుడు కూలేశ్వరరావుగా మారిపోయారంటూ విమర్శించారు. ఇక ఫిరాయింపులపై మాట్లాడే హక్కు హరీష్ రావుకు లేనే లేదన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేతో ఎటువంటి ఉపయోగం లేదని, రాష్ట్రంలో బీఆర్ఎస్ సినిమా అయిపోయిందంటూ సెటైర్స్ వేశారు.