కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీకి చెందిన 31 ఏళ్ల డాక్టర్‌ను… సంజయ్ రాయ్ అనే వ్యక్తి రేప్ చేసి మర్డర్ చేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యక్తి ఆస్పత్రి ఉద్యోగి కాదు అని తెలిసింది. కానీ క్యాంపస్ బిల్డింగ్ వద్ద రెగ్యులర్‌గా కనిపించేవాడు. కోల్‌కతా పోలీసు విభాగంలో సివిల్ వాలెంటీర్‌గా చేశాడు. ఆ కాంట్రాక్టు ఉద్యోగికి నెల 12 వేల జీతం. ట్రాఫిక్, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో వాలంటీర్‌గా చేశాడు.
2019లో అతను డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో వాలంటీర్‌గా చేరాడు. ఆ తర్వాత పోలీసు వెల్ఫేర్ సెల్‌కు బదిలీ అయ్యాడు. ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ వద్ద ఉన్న పోలీసు ఔట్‌పోస్టులో చేశాడు. ఆస్పత్రిలోని అన్ని శాఖలకు అతనికి యాక్సిస్ ఉన్నది. ఎవరైనా దూరం నుంచి పేషంట్లు వస్తే, వాళ్లకు అడ్మిషన్ ఇప్పించడం, బంధువుల కు బెడ్ ఇప్పించే దందాకు పాల్పడ్డాడు.
రెగ్యులర్ పోలీసు కాకపోయినా.. సంజయ్ రాయ్ మాత్రం తనకు ఉన్న కాంటాక్టులతో పోలీసు బరాకుల్లో ఉండేవాడు. కోల్‌కతా పోలీసు అని రాసి ఉన్న టీషర్ట్ వేసుకునేవాడు. అతనికి బైక్‌పై కూడా కేపీ ట్యాగ్ ఉండేది. కోల్‌కతా పోలీసు వ్యక్తిగా అతను పరిచయం చేసుకునేవాడు. నిజంగానే ఇతను పోలీసేమో అని చాలా మంది అనుకునేవారట.
మహిళా డాక్టర్ రేప్, మర్డర్ కేసులో విచారణ వేగంగా జరుగుతున్నది. పోలీసులు ప్రశ్నించడం మొదలుపెట్టగానే, అతను క్రైంను అంగీకరించినట్లు తెలుస్తోంది. అతను ఏ మాత్రం పశ్చాతాపాన్ని చూపలేదు. కావాలంటే ఉరి తీసుకోండి అంటూ పేర్కొన్నాడట. నిందితుడి మొబైల్ ఫోన్‌లో మొత్తం పోర్న్ వీడియోలే ఉన్నాయి.
ఆస్పత్రి పరిసరాల్లో సీసీటీవీ కెమెరాల ఆధారంగా రాయ్‌ను అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం 4 గంటలకు అతను ఎమర్జెన్సీ బిల్డింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని గంటల తర్వాత లేడీ డాక్టర్ డెడ్‌బాడీని అక్కడే గుర్తించారు. అయితే బాధితురాలి బాడీ వద్ద ఉన్న బ్లూటూత్ హెడ్‌సెట్ కీలక ఆధారంగా నిలిచింది. బిల్డింగ్‌లోకి ఎంటర్ అవుతున్న సమయంలో.. రాయ్ మెడకు హెడ్‌సెట్ ఉన్నట్లు గుర్తించారు. అతను వెళ్లిపోతున్న సమయంలో ఆ హెడ్‌సెట్ లేదు. డెడ్‌బాడీ వద్ద ఉన్న హెడ్‌సెట్.. నిందితుడి హెడ్‌సెట్‌తో పెయిర్ అయ్యింది.
మర్డర్ తర్వాత ఇంటికి వెళ్లిన రాయ్.. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు దుస్తులను వాష్ చేసుకున్నాడు. కానీ అతని షూపై మాత్రం రక్తపు మరకలను గుర్తించారు. ఆగస్టు 23వ తేదీ వరకు అతన్ని రిమాండ్‌లో ఉంచారు.